షుగర్‌ పేషెంట్స్‌ ఈ వాటర్‌ తాగితే చాలు.. 

11 January 2024

TV9 Telugu

బార్లీ వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హెల్త్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అన్నం కంటే బార్లీ తీసుకునే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయి.

బార్లీ వాటర్‌ను తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే.. ఇన్సులిన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. 

బార్లీలో అధికంగా ఉండే ఫైబర్‌.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.

బార్లీ నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆహారంలోని పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. 

ఇక బార్లీ వాటర్‌ తాగితే కొలెస్ట్రాల్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ నీరు ఉపయోగపడుతుంది. 

ఇక బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా.. బార్లీని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని, పౌడర్‌ చేసుకోవాలి. అనంతరం నీటిని మరిగించి అందులో పొడిని కలుపుకొని తీసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.