వృత్తి, ఉద్యోగాలలో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ మీద ఆధారపడతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. వ్యాపారపరంగా ఒకటి రెండు సమస్యలను అధిగమిస్తారు.
కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని మాత్రమే పూర్తవుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది.
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు మామూలుగానే సాగిపోతాయి. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వ్యూహాలు రూపొందించడం వంటివి జరిగే అవకాశం ఉంది.
ఇష్టమైన వారితో కలిసి విందులో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
తోబుట్టువులతో ఆస్తి వివాదాలు లేదా కుటుంబ సంబంధమైన వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సాటి లేని మేటి అనిపించుకుంటారు.
ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.
ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు మాత్రం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఇతర వృత్తుల వారి కంటే డాక్టర్లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. గుర్తింపు లభించడం, సంపాదన పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది.
సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. బంధుమిత్రులతో మరింతగా సఖ్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడం గానీ, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరగవచ్చు.