28 November 2023
విశాఖ తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు
నేవీ డే వేడుకలకు సిద్ధం అంటోంది విశాఖ తీరం. కనుల విందుగా సాగిన నేవీ డేకి సంబంధించి రిహార్సల్స్ జరిగాయి.
ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాల ప్రదర్శన చూడ్డం కోసం ఆసక్తిగా ఉన్నారు విశాఖ జనం.
డిసెంబర్ 4.. భారత నావికా దినోత్సవం. ఏటా విశాఖ తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్.
అద్భుతమైన అనుభూతి కోసం ఎదురుచూస్తోంది విశాఖ తీరం. విశాఖ వాసులకు ఒక శాంపిల్ చూపించిన రిహార్సల్స్.
యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.. శత్రువులపై ఎదురు దాడికి ఎలా సన్నద్ధమవుతుంది.. కళ్లకు కట్టినట్టు చూపించిన నేవీ సిబ్బంది.
గగనతలంలో నేవీ హెలికాప్టర్లు, సముద్ర జలాల్లో యుద్ధనౌకలు సంయుక్తంగా చేసిన విన్యాసాలు అదుర్స్ అనిపించాయి.
విపత్తుల సమయంలో నావికా దళం చేపట్టే సహాయకచర్యల్ని కూడా ప్రదర్శించారు.
1971 నాటి ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారత నేవీ విభాగం వీరోచిత భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ 4న నేవీ డే సెలబ్రేషన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి