కరివేపాకు మనల్ని ఎన్ని రోగాల నుంచి రక్షిస్తుందో తెలిస్తే అవాక్కే..!
TV9 Telugu
03 February 2024
కరివేపాకు వాసన కమ్మగా ఉంటుంది. అందుకే మనం దీన్ని ప్రతి కూరలో వేస్తాం. కరివేపాకు ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కఫం రాకుండా మనల్ని కాపాడుతుంది. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని తగ్గిస్తుంది.
డయాబెటిస్ పేషెంట్లకు కరివేపాకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని షుగర్ పేషెంట్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, కరివేపాకు నమిలితే కంట్రోల్ అవుతుంది. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.
కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
కరివేపాకు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ నష్టాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. చర్మంపై కనిపించే సన్నని గీతలు, ముడతలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.