కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌తో పనేంటి.. 

31 December 2023

ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన బలగం మంచి విజయాన్ని అందుకుంది. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రూ. 25 కోట్లు రాబట్టింది. 

ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో చిత్రం మ్యాడ్. చిన్న సినిమాగా వచ్చి డీసెంట్‌ హిట్‌ను సొంతం చేసుకుందీ మూవీ. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. 

ఈ ఏడాది హిట్‌ కొట్టిన లో బడ్జెట్ మూవీస్‌లో బేబీ ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు రాబట్టి సెన్సేషన్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. 

బెదురు లంక కూడా ఈ ఏడాది డీసెంట్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. కార్తికేయ హీరో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన మరో చిన్న బడ్జెట్‌ మూవీ కీడాకోలా. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. 

మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన పొలిమేర 2 కూడా ఈ ఏడాది మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం విశేషం. 

ఇక ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన మరో బడ్జెట్ మూవీ.. రైటర్‌ పద్మ భూషణ్‌. సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.