ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక వింత దొంగతనం చోటుచేసుకుంది. ఒక దొంగ ఐఫోన్‌ను దొంగిలించడమే కాకుండా, అందులో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌కు మెసేజ్‌లు పంపుతూ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పమని పదే పదే వేధిస్తున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వింత మెసేజ్‌లను అందుకున్న యువతి కౌషిక్ ధ్యాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరుడి ఐఫోన్ దొంగిలించబడిందని, అందులో తన నంబర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌గా ఉందని ఆమె తెలిపింది. పాస్‌వర్డ్ లేకపోయినా ఎమర్జెన్సీ నంబర్‌కు మెసేజ్‌లు వస్తాయని, ఆ దొంగ రాత్రి పగలు తేడా లేకుండా పాస్‌వర్డ్ చెప్పమని సతాయిస్తున్నాడని ఆమె పోలీసులకు వివరించింది. దొంగతనం తన సోదరుడు ఇంట్లోనే ఉన్నప్పుడు జరిగిందని, హాల్లో సెల్ ఫోన్ పెట్టగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాన్ని పట్టుకెళ్లారని కౌషిక్ ధ్యాని పేర్కొంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ విజువల్స్, దొంగ పంపిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు పోలీసులకు సమర్పించినా వారు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. అయితే, పోలీసులు మాత్రం సెల్ ఫోన్‌ను ట్రాక్ చేస్తున్నామని చెబుతున్నారు. ఒక దొంగ సెల్ ఫోన్ దొంగిలించి, దాని పాస్‌వర్డ్ అడగడం చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన అని ఈ కేసు ప్రత్యేకతను చాటుతోంది.