టాబ్లెట్ షీట్ ఆకృతిలో రూపొందించిన పెండ్లి పత్రిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫార్మసిస్ట్ శిరీష, మెడికల్ రిప్రజెంటేటివ్ నవీన్ వివాహానికి వారి వృత్తులకు తగ్గట్టుగా ఈ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. వధూవరుల వివరాలు, వారి తల్లిదండ్రుల పేర్లు, వివాహ స్థలం, సమయాలు స్పష్టంగా పేర్కొంటూ ఫిబ్రవరి 4న జరగనున్న పెండ్లికి ఆహ్వానం పలికింది.