విమానంలో కీర్తి సురేష్ కు వేధింపులు.. భర్త కళ్లెదుటే..

×

విమానంలో కీర్తి సురేష్ కు వేధింపులు.. భర్త కళ్లెదుటే..

ప్రముఖ నటి కీర్తి సురేష్‌ ఇటీవల విమానంలో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మిలాన్ నుంచి తన భర్త ఆంటోనీతో కలిసి భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో, విమానంలో ఒక అభిమాని ఆమెను గుర్తించాడు. మద్యం సేవించి ఉన్న ఆ అభిమాని వెంటనే కీర్తి సురేష్‌ను సెల్ఫీ కోసం డిమాండ్ చేశాడు. కాసేపు ఆగితే ఫోటో ఇస్తానని ఆమె మర్యాదగా చెప్పినప్పటికీ, అతను వినలేదు. కీర్తి భర్త జోక్యం చేసుకుని అతన్ని వారించినా, అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కీర్తి, నేను ఎప్పుడు ఫోటో ఇవ్వాలో మీరు నిర్ణయించలేరు అని స్పష్టం చేసింది. వెంటనే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ, తాను అభిమానులతో మాట్లాడటాన్ని ఇష్టపడతానని, అయితే కొంతమంది అభిమానులు వ్యక్తిగత హద్దులను గౌరవించరని పేర్కొంది. సెలబ్రిటీలను మనుషుల్లా గుర్తించి, వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె కోరారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనల వల్ల అభిమానులందరికీ చెడ్డపేరు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Phani CH