దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి. ప్రతిరోజూ దానిమ్మ తీసుకోవడం వల్ల రక్తహీనత తొలగిపోయి, రక్తం వృద్ధి చెందుతుంది. ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచడమే కాకుండా, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.