ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. కందిపప్పు, పామాయిల్, గోధుమపిండిని తక్కువ ధరలకే రేషన్లో అందించాలని ఆదేశించారు. కిలో కందిపప్పు రూ.100, లీటర్ పామాయిల్ రూ.110, కిలో గోధుమపిండి రూ.25కి లభించనున్నాయి. ధరణి బ్రాండ్ బియ్యం కూడా మొబైల్ వాహనాల ద్వారా రూ.49-50కి విక్రయించనున్నారు. సామాన్యులపై ధరల భారం తగ్గడమే లక్ష్యం.