వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

ఇంకా చదవండి

YS Jagan: ఇట్స్ ఫ్యామిలీ టైం.! యూరప్‌ టూర్‌లో సీఎం జగన్.. వెకేషన్ ఎన్ని రోజులంటే.?

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక కౌంటింగ్‌కి చాలా సమయం ఉండడంతో.. కుటుంబంతో సరదాగా గడిపేందుకు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా..

CM Jagan: ‘దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది’.. ఐ ప్యాక్ టీంను కలిసిన సీఎం జగన్..

ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్. మే 16న గురువారం ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‎లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్.

  • Srikar T
  • Updated on: May 16, 2024
  • 1:13 pm

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

YS Jagan: ఫారిన్ టూర్‎కు ఏపీ సీఎం జగన్.. ఫ్యామిలీ వెకేషన్‎ ఎన్ని రోజులంటే..

జగన్ విదేశీ టూర్‎కు సీబీఐ కోర్ట్ అనుమతి ఇచ్చింది. మే 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్ కు వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గత రెండు నెలల నుంచి ప్రజల మధ్యే తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 5:40 pm

Watch Video: పిఠాపురంలో ఎర్ర కండువా రాజకీయం..వంగా గీత వర్సెస్ నాగబాబు

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువాను వేసుకోవడంపై వంగా గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

AP Elections: ఏపీలో మళ్లీ అధికారం మాదే.. మంత్రి అంబటి రాంబాబు లెక్క ఇదే..

ఏపీలో పోలింగ్‌ జరిగిన తీరు ఆశ్చర్యపర్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఈ పోలింగ్‌ వైసీపీ విజయానికి సంకేతం అని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 1:46 pm

YS Jagan: నేడు పులివెందులకు సీఎం జగన్ దంపతులు.. ఓటు వేసేందుకు సిద్దం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులకు వెళ్లనున్నారు. మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈరోజు బయల్దేరనున్నారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రచారంతో ముగింపు పలికారు. ఈరోజు తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నారు. సాయత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పులివెందులు చేరుకుంటారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

  • Srikar T
  • Updated on: May 12, 2024
  • 10:49 am

YS Jagan: ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు.. సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన పోస్ట్‌..

ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో ఆసక్తికమైన పోస్ట్‌ చేశారు. " ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు" అంటూ తన పోస్ట్‌లో చెప్పారు జగన్‌.

YS Jagan: లాస్ట్‌ పంచ్‌.. ఫినిషింగ్ టచ్.. పిఠాపురంలో సీఎం జగన్.. లైవ్..

ఎన్నికల ప్రచారంలో లాస్ట్‌పంచ్‌ను పిఠాపురంలో చూపించబోతున్నారు సీఎం జగన్‌. ఈ రోజు చిలకలూరిపేట, కైకలూరు సభల్లో ప్రసంగించిన జగన్‌..కాసేపట్లో పిఠాపురం సభలో పాల్గొనబోతున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్‌ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకుంది.

‘రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం..

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఈ నియోజకవర్గ అభ్యర్థి మనోహర్ నాయుడు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఆయన సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 1:04 pm

CM Jagan: ‘చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోతన నివాసంలో ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆయన అమలు చేసే ఉద్దేశం లేదుకనుకనే ఎలాంటి హామీలైనా ఇస్తాన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 26వేల డ్వాక్రా రుణాలను సీఎం జగన్ రుణ మాఫీ చేశారన్నారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 11:02 am

CM Jagan: పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్..

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. సాయంత్రం 6గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి ఇక కొన్ని గంటల మాత్రమే ఉండడంతో లాస్ట్‌డే సుడిగాలి ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 9:05 am

ఆర్ కృష్ణయ్యపై రాయితో దాడి.. తీవ్రంగా ఖండించిన బీసీ నేతలు..

ఏర్పేడులో ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సంఘం నాయకులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నల్లరిబ్బన్లతో నిరసనకు దిగారు. ఆర్ కృష్ణయ్యకు వెంటనే వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 6:43 am

Watch Video: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న అవాస్తవాలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్నారు. వీళ్లు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని అడిగారు.

  • Srikar T
  • Updated on: May 10, 2024
  • 1:29 pm

CM Jagan: ‘పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి’.. మంగళగిరి సభలో సీఎం జగన్..

విశ్వసనీయతకు, విలువలకు అర్థం చెప్పింది మీ బిడ్డ అన్నారు సీఎం జగన్. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలో 99శాతం అమలు చేసి చూపించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. గతంలో ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గతంలో అబద్దాలకు రెక్కలుకట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చేదన్నారు.

  • Srikar T
  • Updated on: May 10, 2024
  • 11:53 am
Latest Articles