ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

Telangana: హైదరాబాద్‎లో ఏపీకి కేటాయించిన భవనాలపై సీఎం రేవంత్ దృష్టి.. అధికారులతో కీలక చర్చ..

జూన్‌2కి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈనెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కరెంట్ వార్.. రేవంత్ వర్సెస్ హరీశ్

తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతల పంచాయితీ మొదలైంది. పవర్‌ కట్‌లకు హరీశ్ రావే కారణమని ఆరోపించారు సీఎం రేవంత్‌. ఈ కామెంట్లకు గులాబీ పార్టీ నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

CM Revanth Reddy: బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావు.. ఇక పరిపాలనపైనే మా దృష్టంతా: సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం (మే 14) మీడియాతో ఛిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలు, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీకి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేశారు.

Hyderabad Lok Sabha Elections: ఓల్డ్ సిటీలో ఓటర్ల ఆధార్‌ను చెక్ చేసిన మాధవీలత.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ స్వయంగా ఐడీ కార్డులు తనిఖీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Revanth Reddy: కొడంగల్‌‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు..

Telangana Lok Sabha Elcetions: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటువేసేందుకు కుటుంబసభ్యులతో కొడంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లా పరిషత్‌ స్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Revanth Reddy: బరిలోకి దిగితే ఇలానే ఉంటాది.. 54 ఏళ్ల వయస్సులోనూ ఇరగదీసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..

ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో.. రెండు నెలలుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి మరో లేఖ రాశారు. లోక్ సభ పోలింగ్ కు ముందు శనివారం లేఖ రాసిన కిషన్ రెడ్డి.. పలు విషయాలను ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అంటూనే.. కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వలేదని చెప్పడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. ‘‘కొద్దిరోజుల క్రితం జాతీయ మేనిఫెస్టోప్రకటనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేకంగా మీరు హామీలు ఇవ్వడం..

Revanth Reddy: అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు.. ఇండియా కూటమిని గెలిపించండి: సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి.. అంటూ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశం విడుదల చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు.. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు..

Khammam: ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?

Khammam Lok Sabha constituency: ఖమ్మానికి పొలిటికల్ గేట్ వే అని పేరు. తెలంగాణ మొత్తానిది ఒక దారి.. ఖమ్మంది మరో దారి అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ మలి ఉద్యమం ఉధృతంగా సాగినా సరే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ వైపే ప్రజలు నిలబడ్డారు. 2014లో, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు ఇక్కడి ప్రజలు.

Telangana: ముక్కుసూటి ప్రశ్నలు.. బుల్లెట్ల లాంటి సమాధానాలు.. రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ఖమ్మం టికెట్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు సీఎం రేవంత్‌. భట్టి, పొంగులేటి కుటుంబాలకి కాకుండా లాయల్‌గా ఉండేవాళ్లకు ఇవ్వమని సోనియా సూచించారన్నారు. తాను మండవకి టికెట్ ఇవ్వాలని సూచన చేశానన్నారు. రేణుకాచౌదరి గడప దాటకుండా రాజ్యసభ సీటు వచ్చిందని.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు. రేవంత్ ఫుల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం....

Hyderabad: ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్, సీఎం రేవంత్.. వీడియో వైరల్..

సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం సిటీ బస్‎లో సందడి చేశారు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు.

  • Srikar T
  • Updated on: May 10, 2024
  • 12:11 pm

Telangana: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీశ్ రావు కుట్ర ఉంది: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్‌ ఎన్నికల బరిలో లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఆరేడు స్థానాల్లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. 4 చోట్ల రెండో స్థానానికే బీఆర్ఎస్‌ పరిమితమన్నారు. బీజేపీని గెలిపించాలని కేసీఆర్‌ చూస్తున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కూడా కామెంట్స్ చేశారు రేవంత్.

Telangana: ప్రధాని RR ట్యాక్స్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్…

బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తారని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో పలు సంచలన కామెంట్స్‌ చేశారాయన. బీసీల జనాభాను లెక్కించబోమని బీజేపీ చెబుతోందన్నారు. కులగణన చేయాలన్నది కాంగ్రెస్‌ వాదన అన్నారు. కులగణన చేస్తేనే రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

Lok Sabha Election: అగ్రనేతల ఎంట్రీతో హీటెక్కనున్న పాలమూరు పాలిటిక్స్‌.. మోదీ – రేవంత్ పోటా పోటీ సభలు

అగ్రనేతల ఎంట్రీతో పాలమూరు పాలిటిక్స్‌ హీటెక్కనున్నాయి. ప్రచారంలో ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు ఇటు పీఎం, అటు సీఎం... ఇద్దరూ గంట వ్యవధిలోనే మహబూబ్‌నగర్‌ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇద్దరు నేతలు...ఒకే రోజు పోటాపోటీగా సభలు నిర్వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. పొలిటికల్‌గా ఫుల్‌ బస్‌ క్రియేట్‌ చేస్తోంది.

Latest Articles