రామ్ చ‌ర‌ణ్‌

రామ్ చ‌ర‌ణ్‌

మెగస్టార్‌ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మెగా పవర్‌ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్లు కొడుతూ ఏకంగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ రేంజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో చెర్రీ కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, బిజినెస్‌ మెన్‌గానూ సత్తా చాటుతున్నాడు రామ్‌ చరణ్‌. 2007లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరుత సినిమాలో వెండితెరకు పరిచయమయ్యాడీ మెగా పవర్‌ స్టార్‌. దుమ్మురేపే డ్యాన్స్‌లు, ఫైట్లతో మొదటి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్‌పేర్‌ పురస్కారం అందుకున్నాడు. ఇక రెండో చిత్రం మగధీరతో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ కొల్లగొట్టాడీ గ్లోబల్‌ స్టార్‌. అంతేకాదు ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా మరో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నాడు. రచ్చతో మాస్‌ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు. ఎవడు, నాయక్‌, ధ్రువ.. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ తో టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్‌లోని నటనా ప్రతిభకు తార్కణంగా నిలిచింది. ఇందులో బుచ్చిబాబుగా చెర్రీ అభినయ విమర్శకులను సైతం మెప్పించింది. ఇదే సినిమాకు ఉత్తమ నటుడిగా మరోసారి ఫిల్మ్‌ పేర్‌ పురస్కారం అందుకున్నాడు రామ్‌ చరణ్‌. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను దున్నేశాడు. సీతారామరాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మెగా పవర్‌ స్టార్ తన నటనతో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఇక నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్థాపించి హిట్‌ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్‌ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2012లో ఉపాసన కామినేనితో పెళ్లిపీటలెక్కారు. 2023లో ఈ దంపతులకు క్లింకార కొణిదెల అనే కూతురు జన్మించింది.

ఇంకా చదవండి

Upasana: చరణ్ వల్లే దాని నుంచి బయటపడ్డా..? అదృష్టం అంటే నాదే.. భర్త పై ప్రేమకురిపించిన ఉపాసన

చాలా మంది హీరోయిన్స్ డిప్రషన్ సమస్య గురించి మాట్లాడారు. ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారో కూడా తెలిపారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా డిప్రషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను కూడా డిప్రషన్ ను ఎదుర్కొన్నా అని తెలిపారు ఉపాసన. అలాగే రామ్ చరణ్ వల్లే ఆ డిప్రషన్ నుంచి బయట పడ్డాను అని తెలిపారు ఉపాసన. అసలు ఉపాసన ఎందుకు.?

Pawan Kalyan: పిఠాపురంలో బాబాయ్‌తో అబ్బాయ్.. పవన్ కల్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్, సురేఖ.. ఫొటోస్ ఇవిగో

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్‌ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు.

Ram Charan: బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం..?

ఈ ఎన్నికల్లో  విజయం సాధించడం కోసం నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో దూసుకుపోతున్నారు. అలాగే జనసేనానికి మద్దతు తెలిపేందుకు చాలా మంది సెలబ్రెటీలు పిఠాపురానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినిమా ఆర్టిస్ట్ లు పిఠాపురంలో పవన్ కు మద్దతు తెలిపేందుకు ప్రచారం చేస్తున్నారు.

Pawan Kalyan: బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా రామ్ చరణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మంగళవారం (మే 07) మొదట మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అందులో కోరారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది.

Game Changer: ఆంధ్రా అయిపోయింది.. ఇక చెన్నైలో చెర్రీ ఆట.!

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్. గేమ్‌ చేంజర్‌ కొత్త షెడ్యూల్‌ని మే ఒకటి నుంచి చెన్నైలో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్‌.

Ram Charan: ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్‌ స్టేజెస్‌లో ఉంది. ఈ చిత్రం పనులు పూర్తికాగానే బుచ్చిబాబు సానా సెట్స్ కి వెళ్తారు రామ్‌ చరణ్‌. జూన్‌ ఆఖరునగానీ, జులైలోగానీ ఆ సినిమా షూటింగ్‌ మొదలవుతుందని టాక్‌.

Ram Chran: నాన్నకు ప్రేమతో.. చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకు వైవిద్యం చూపుతూ.. మెగా పవర్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల నోరు మూయించాడు.

Film News: ట్రెండింగ్‌ స్టార్‌ మహేష్.. పొలిమేర 2కి అరుదైన గౌరవం..

సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతున్నారు మహేష్. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆమీర్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన సినిమా పీకే . నాగచైతన్య హీరోగా విరూపాక్ష దర్శకుడు కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది పొలిమేర2. దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

Movie Updates: గ్యాంగ్‌స్టర్‌గా మాళవిక.. గేమ్‌ చేంజర్‌ ముచ్చట ఇదే..

డ్రీమ్‌ రోల్‌ గురించి స్పందించారు నటి మాళవిక మోహనన్‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. ఆనంద్‌ దేవరకొండ కెరీర్‌లో నటిస్తున్న తొలి యాక్షన్‌ సినిమా గం గం గణేశా. ఆర్టికల్‌ 370కి వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు నటి యామీ గౌతమ్‌. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. 

Ram Charan-Allu Arjun: ఆ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు.. ఏ మూవీ అంటే..

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో చరణ్ హీరోగా తెరంగేట్రం చేశారు. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పిచంలేకపోయింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

TOP9 ET: ఒక్క సినిమా.. రూ.120 కోట్ల రెమ్యునరేషన్ వా.. చరణ్‌! | ముద్దుల హీరోగా డార్లింగ్.

కోలీవుడ్లో స్టారాధి స్టారుడు.. గ్రేటాది గ్రేటాది గ్రేటుడు ఎవరంటే.. రజినీ అంటున్నారు అంతా! దాదాపు 73ఏళ్ల వయసులోనూ.. మాస్‌కి మరణం చూపిస్తున్న ఈ సూపర్ స్టార్... ఇప్పుడు రెమ్యునరేషన్‌లో మరో రికార్డును క్రియేట్ చేశారు కనుక! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న కూలీ సినిమా కోసం.. రజినీ ఏకంగా 260 కోట్ల నుంచి 270 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఒక వేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా తలైవా రికార్డులకెక్కడం ఖాయం.

Game Changer Movie : గేమ్ ఛేంజర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. సినిమాకే హైలైట్ గా ఆ సాంగ్

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు. కాగా గేమ్ ఛేంజర్  సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Chiranjeevi: అవకాయ పచ్చడి చేసిన చిరంజీవి సతీమణి సురేఖ.. వీడియో తీసిన ఉపాసన.. మీరూ చూడండి..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది మెగా కోడలు ఉపాసన. ఇందులో భాగంగా అత్త కోడళ్లు కలిసి ప్రీ కుక్‌డ్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ మిక్స్‌లు తయారు చేస్తున్నారు.

Tollywood: ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు.?

బిగ్‌ టార్గెట్‌ పెట్టుకోవడం తేలికే. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. మంచి కథ కావాలి. దాన్ని సమర్థవంతంగా నడిపించే కెప్టెన్‌ కావాలి. కన్వీనియంట్‌ రిలీజ్‌ టైమ్ ఉండాలి... ఇంకా ఎన్నో ఎనెన్నో.. మరి అన్నిటినీ దాటి ఆ వెయ్యి కోట్ల కుంభస్థలాన్ని కొట్టడానికి క్యూలో మన ముందు నలుగురు స్టార్‌ హీరోలు కనిపిస్తున్నారు.. ఎవరి నీడా లేకుండా.. సొంతంగా ట్రయల్స్ వేస్తున్నారు. వీళ్లల్లో ఈ సారి నెగ్గుకొచ్చేదెవరు? ఓ సౌత్‌ డైరక్టర్‌ వెయ్యి కోట్లను దాటి,

Movies : డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..

ఇప్పటివరకు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో పాటు అన్ని భాషల్లో భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని బడా సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు రానున్న సినిమాల్లో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు.

Latest Articles