పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్‌కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉంది.

2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సోషల్ మీడియాలోనూ పవన్ కల్యాణ్‌కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రమ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!

ఇంకా చదవండి

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

Pawan Kalyan – Anna: కాశీ విశ్వనాధుని సేవలో పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు చూశారా..?

అనంతరం.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అనా కొణిదెల కాశీ విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు.

Watch Video: పిఠాపురంలో ఎర్ర కండువా రాజకీయం..వంగా గీత వర్సెస్ నాగబాబు

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువాను వేసుకోవడంపై వంగా గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

PM Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మంజుల

ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తేనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? రచ్చ రచ్చే.. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఇద్దరూ పెద్దగా బయట కనిపించారు.

Watch Video: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు.

  • Srikar T
  • Updated on: May 13, 2024
  • 10:53 am

Pawan Kalyan: పిఠాపురంలో బాబాయ్‌తో అబ్బాయ్.. పవన్ కల్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్, సురేఖ.. ఫొటోస్ ఇవిగో

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్‌ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు.

Gabbar Singh: మాస్ బోనాంజాకు 12 ఏళ్లు.. ఈ సినిమా టైటిల్‌కి స్ఫూర్తి ఎవరో తెల్సా..?

‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’.. 'నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ'... 'నేను చెప్పినా ఒకటే.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే..' ఏమన్నా డైలాగ్సా ఇవి..? అందుకే సినిమా సంచలన విజయం సాధించింది. పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. హంగామాకు 12 ఏళ్లు.

Ram Charan: బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం..?

ఈ ఎన్నికల్లో  విజయం సాధించడం కోసం నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో దూసుకుపోతున్నారు. అలాగే జనసేనానికి మద్దతు తెలిపేందుకు చాలా మంది సెలబ్రెటీలు పిఠాపురానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినిమా ఆర్టిస్ట్ లు పిఠాపురంలో పవన్ కు మద్దతు తెలిపేందుకు ప్రచారం చేస్తున్నారు.

Pawan Kalyan: పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం

ఏపీ ఎలక్షన్లలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఈనేపథ్యంలో పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తాజాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ పిఠాపురంలో పర్యటించారు.

Pawan Kalyan: ‘మీ ప్రేమకు బానిసలం’.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టిన అల్లు అర్జున్, సంపూర్ణేష్

జనసేన అధినేతకు మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ నటీనటులు సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, కిర్రాక్ ఆర్పీ, నిర్మాత నాగవంశీ తదితరులు పవన్ ని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను స్వయంగా కోరారు

Watch Video: ‘ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు’.. పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేష్‌. ఆస్తుల కోసమే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారన్నారు. ఒకప్పుడు కారుకు EMI కట్టలేని పవన్‌.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారాయన. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్‌. మంగళగిరిలో వందకోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్‌.

  • Srikar T
  • Updated on: May 9, 2024
  • 1:50 pm

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am

Pawan Kalyan: బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా రామ్ చరణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మంగళవారం (మే 07) మొదట మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అందులో కోరారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan: ‘ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి’.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు

జనసేన అధినేతకు మద్దతుగా మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కమెడియన్ పృథ్వీ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు కూడా పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించారు

Latest Articles