నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

Lok Sabha Elections: ముంబైలో మోదీ భారీ రోడ్‌షో.. టీవీ9తో ప్రధాని కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ.

Mamata Banerjee – PM Modi: మోదీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..? మరి తింటారా..? ప్రధానికి సీఎం మమతా ఆఫర్.. బీజేపీ ఫైర్..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కోసం ఏదైనా వండడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే ప్రధానమంత్రి దానిని రుచి చూడటానికి సిద్ధంగా ఉంటారో..? లేదో.. తెలియదంటూ.. వ్యాఖ్యానించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ మమతా బెనర్జీ బిజెపికి చురకలంటించారు. న

PM Modi: సొంత ఇల్లు, కారు లేదు.. ప్రధాని మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

PM Modi election affidavit: వారణాసి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు ప్రధాని మోదీ. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు. సొంతిల్లు.. కారు లేదని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు మోదీ.

Watch Video: ‘తెలంగాణను కాంగ్రెస్ సంక్షోభంలోకి తీసుకెళ్తోంది’.. బీజేపీ నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, హామీలు ఎలా అమలుచేస్తారని విమర్శించారు. హామీల అమలుకు ప్రతి ఏటా రూ. 2 లక్షల కోట్లు కావాలని వివరించారు.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 2:33 pm

PM Modi: మోదీ పేరు ప్రతిపాదించిన ఆ నలుగురు ఎవరో తెలుసా?

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం.. ముక్తిధామం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారిగా 2014లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన మోదీ, ఆ తర్వాత ప్రధానిగా 2019లో నామినేషన్ దాఖలు చేశారు.

ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా.. మోదీ ప్రధాని అవడం ఖాయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్‌ ప్రక్రియకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితం వారణాసి చేరుకున్న ఆయన.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఏపీలో సార్వతిక ఎన్నికలు మే 13న ముగియడంతో ప్రస్తుతం మోదీకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 12:26 pm

PM Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు.

PM Modi Nomination: హ్యాట్రిక్‌పై గురి.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌.. లైవ్

PM Modi Nomination Live: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు.. ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేసి హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్‌ నుంచి నమోఘాట్‌కు చేరుకుని మోదీ పూజలు చేశారు.

PM Modi: రోడ్ షోలో అడుగడున పూల వర్షం.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన కాశీ ప్రజలు

దేశవ్యాప్తంగా నాల్గోవ దశ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన నియోజకవర్గమైన వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. మంగళవారం (మే 14) ఉత్తరప్రదేశ్ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

PM Modi: పాకిస్తాన్ అణుబాంబుపై ప్రధాని మోదీ చురకలు.. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌‎కు కౌంటర్..

పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున మనం భయపడాల్సిందే అంటూ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్తాన్‎లో అణు బాంబులు ఉన్నాయి అని పదే పదే చెప్పడంపై ముఖ్య ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. అయితే వాటిని విక్రయించడానికి ఎవరైనా వెతుకుతున్నారా అని అడిగారు. వాటిని కొనుగోలు చేయాలంటే కూడా అందులో సరైన నాణ్యత లేదని ఎద్దేవా చేశారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 12:38 pm

PM Modi Autograph: నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి.. మోదీ కోసం ఎదురు చూసిన యువతి.. చివరికి..!

మూడోవసారి అధికారమే లక్ష్యంగా ప్రధాన మంత్రి మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో అన్ని వర్గాలను ఇట్టే ఆకర్షిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మోదీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్బీ స్టేడియంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది.

PM Modi: హైదరాబాద్‌లో తన ఐడియా ఆఫ్ ఇండియాను వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నాలుగోవ విడత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్బీ స్టేడియం సభలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఫినిషింగ్‌ టచ్‌ గట్టిగానే ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పడొక లెక్క.. అన్నట్లు ప్రధాని మోదీ ప్రసంగం అడుగడుగునా ఉర్రూతలు ఊగిస్తూ సాగింది.

PM Modi: కిక్కిరిసిన మోదీ బహిరంగ సభ.. ఆయన చూపు ఆ ఇద్దరిపై పడింది.. ఏం చేశారో తెలుసా..?

నాలుగోవ విడత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా.. భారత ప్రతిష్ఠ పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం సాగుతోంది.

PM Modi: ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయి.. రేవంత్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారుః మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట సభలో మోదీ గ్యారంటీ అంటే ఏంటో వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెంచడం అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం, 70ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం అని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు అవుతుందని తెలిపారు ప్రధాని.

PM Modi: ‘నకిలీ శివసేన వ్యక్తులు నన్ను సజీవ సమాధి చేస్తారట’.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు శివసేన (యూబీటీ)ని కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. నకిలీ శివసేన వ్యక్తులు నన్ను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.