చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా.. మోదీ ప్రధాని అవడం ఖాయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్‌ ప్రక్రియకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితం వారణాసి చేరుకున్న ఆయన.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఏపీలో సార్వతిక ఎన్నికలు మే 13న ముగియడంతో ప్రస్తుతం మోదీకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 12:26 pm

PM Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు.

‘రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం..

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఈ నియోజకవర్గ అభ్యర్థి మనోహర్ నాయుడు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఆయన సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 1:04 pm

CM Jagan: ‘చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోతన నివాసంలో ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆయన అమలు చేసే ఉద్దేశం లేదుకనుకనే ఎలాంటి హామీలైనా ఇస్తాన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 26వేల డ్వాక్రా రుణాలను సీఎం జగన్ రుణ మాఫీ చేశారన్నారు.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 11:02 am

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

టిడిపి అధినేత చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫైట్ ఆసక్తికరంగా మారింది. కుప్పంను టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే టిడిపి లక్ష ఓట్ల టార్గెట్‎ను రీచ్ కావాలని చూస్తోంది. వైసీపీని గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డి భుజానికి ఎత్తుకుంటే చంద్రబాబు గెలుపు కోసం నారా ఫ్యామిలీ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా పట్టు నిలుపుకునేందుకు టిడిపి, పట్టు సాధించేందుకు వైసిపి ప్రయత్నిస్తుంటే మధ్యలో లక్ష్మీపార్వతి ప్రచారం వైసీపీ కేడర్‎లో కొత్త జోష్ ను తీసుకొచ్చింది.

Watch Video: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న అవాస్తవాలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్నారు. వీళ్లు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని అడిగారు.

  • Srikar T
  • Updated on: May 10, 2024
  • 1:29 pm

Khammam: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎవరికి..? ఆసక్తిగా మారిన రాజకీయం

ఖమ్మం గుమ్మంలో ఏ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తుంది? ఎంపీ ఎన్నికల్లో వాళ్ల ఓటు ఎటువైపు? కాంగ్రెస్‌ అభ్యర్థికి చెయ్యెత్తి జై కొడతారా? కులాల కూడికలు తీసివేతలు చేసి కారెక్కుతారా? లేక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి వెళతారా?.. ఇంట్రస్టింగ్ డీటేల్స్.....

AP Family Politics: నాలుగు కుటుంబాలే కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. గెలిచేదెవరు.. నిలిచేదెవరూ..?

వైఎస్, కొణిదెల, నారా-నందమూరి.. ఏపీలో ఎన్నికలు ఆ నాలుగు కుటుంబాలే కేంద్రంగా జరుగుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. రేపటిరోజున జయాపజయాలు, వాటి పర్యవసానాల ఎఫెక్ట్ నేరుగా ఆ నాలుగు కుటుంబాల మీదే పడబోతోంది. కానీ.. గ్రౌండ్ లెవల్‌లో కూడా ఇటువంటి ఫ్యామిలీ సర్కస్ ఫీట్లు చాలానే ఉన్నాయి. డజనుకు పైగా కుటుంబాలనుంచి మల్టిపుల్ క్యాండేట్లను బరిలో దింపి.. ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్‌ని జోరుగా షురూ చేశాయి ఏపీలో ప్రధాన పార్టీలు.

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am

‘తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్‌ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం.

AP Politics: ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌ ఏంటి?

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు.. చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు.?

ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 9:29 am

AP Elections 2024: ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కూటమి కోసం సారొస్తున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 6:35 am

‘లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు’.. ల్యాండ్ టైటిలింగ్‎ దుష్ప్రచారంపై ఏపీ మంత్రి స్పష్టత..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పార్ట ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదన్నారు. లేని చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని వివరించారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 4:17 pm
Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే