లోక్‌సభ ఎన్నికలు 2024

లోక్‌సభ ఎన్నికలు 2024

2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.

దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

ఇంకా చదవండి

Telangana: తెలంగాణలో BJP గెలిచే స్థానాలు ఎన్నంటే..? ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.

Telangana: ఈ నియోజకవర్గ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిది..! పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం..

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు.. బరిలో ఎవరు నిలుస్తారు.. ఇలా చాలా చర్చ జరిగింది. పోలింగ్ ముగిసింది.. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఏపార్టీ జెండా ఎగరేస్తుంది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇలా కొత్త చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతోమందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

Watch Video: పొలిటికల్ వార్ ముగిసింది.. ఫ్యామిలీ టైమ్ అంటున్న నేతలు.. ఎలా రిలాక్స్ అవుతున్నారంటే..

ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్‎లో భద్రంగా ఉంది. రెండు నెలలపాటు ప్రచారాలతో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులు వారికి మద్దతుగా ప్రచారంలో పరుగులు పెట్టిన ఎమ్మెల్యేలు, నేతలు రిలాక్స్ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు ఎగ్జిబిషన్స్‎తో కొందరు.. మరి కొందరు ఇంట్లో పిల్లలతో గేమ్స్ ఆడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు.

  • Srikar T
  • Updated on: May 16, 2024
  • 1:52 pm

Telangana: లోక్ సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమా.. ఆ పార్టీ నేతల లెక్కలు ఇవే..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజెపి భారీ ఆశలు పెట్టుకుంది. ఆది నుంచి డబుల్ డిజిట్ టార్గెట్‎గా ఫోకస్ పెట్టిన కమలదళం.. పోలింగ్ ట్రెండ్ చూసి డబుల్ ధమాకా ఖాయం అని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు పెంచుకున్న కాషాయపార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య స్థాయిలో ఓట్ల శాతం పెరుగుతుందని.. మెజారిటీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మోడీ చరిష్మా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‎లో ఉన్నారు.

Lok Sabha Elections 2024: రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికలు.. స్టార్ నటుడు పవన్‌పై తల్లి పోటీ!

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 దశలు పూర్తికాగా ఇంకా 3 దశలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో బీహార్‌లో జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. బీహార్‌ ఎన్నికల్లో భోజ్‌పురి సూపర్‌ స్టార్‌ పవన్ బరిలో నిలిచారు. కరాకట్ నియోజకవర్గం నుంచి పవన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు నటుడు..

Lok Sabha Elections: ముంబైలో మోదీ భారీ రోడ్‌షో.. టీవీ9తో ప్రధాని కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ.

Mamata Banerjee – PM Modi: మోదీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..? మరి తింటారా..? ప్రధానికి సీఎం మమతా ఆఫర్.. బీజేపీ ఫైర్..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కోసం ఏదైనా వండడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే ప్రధానమంత్రి దానిని రుచి చూడటానికి సిద్ధంగా ఉంటారో..? లేదో.. తెలియదంటూ.. వ్యాఖ్యానించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ మమతా బెనర్జీ బిజెపికి చురకలంటించారు. న

Telangana: కోటి మంది ఓటింగ్‎కు పోలింగ్‎కు దూరం.. నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే.?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మూడు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకపోవడంతో ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు తెలిపింది ఈసీ. అత్యధికంగా భువనగిరి అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్.

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

Pawan Kalyan – Anna: కాశీ విశ్వనాధుని సేవలో పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు చూశారా..?

అనంతరం.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అనా కొణిదెల కాశీ విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు.

AP Election: ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. ఏయే జిల్లాల్లో ఎంత శాతం నమోదైందో తెలుసా?

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాయి. పోలింగ్‌ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల వెల్లడించారు. కాగా, సాధారణ ఓటింగ్‌లో 80.66శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి

PM Modi: సొంత ఇల్లు, కారు లేదు.. ప్రధాని మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

PM Modi election affidavit: వారణాసి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు ప్రధాని మోదీ. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు. సొంతిల్లు.. కారు లేదని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు మోదీ.

CM Revanth Reddy: బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావు.. ఇక పరిపాలనపైనే మా దృష్టంతా: సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం (మే 14) మీడియాతో ఛిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలు, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఆగని గొడవలు.. కొనసాగుతున్న ఘర్షణలు.. ఈ ప్రాంతాల్లో..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి

Congress: ప్రజా పాలనకు ప్రజలు మొగ్గు.. మెజార్టీ సీట్లు తమకే.. సీఎం రేవంత్ అంచనా..

రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంది. అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు తమ ప్రజాపాలనను ఆశీర్వదించారని ధీమాతో ఉంది. ఇప్పటివరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 సీట్లు పక్కాగా గెలుస్తామనే అంచనాకు వచ్చింది.

  • Srikar T
  • Updated on: May 14, 2024
  • 5:00 pm
Latest Articles
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..