ఐపీఎల్ 2024

ఐపీఎల్ 2024

IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్‌గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్‌నే కాకుండా ప్రపంచ క్రికెట్‌ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి గెలిచాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది. అయితే, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్ దక్కించుకోలేకపోయింది.

IPL ప్రతి సీజన్‌కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.

ఐపీఎల్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఇంకా చదవండి

RCB vs CSK: 5 జట్లు ఔట్.. అర్హత పొందిన మూడు.. 4వ ప్లేస్ కోసం చెన్నై, బెంగళూరు ఉత్కంఠ పోరు..

IPL 2024 Playoff Qualification Scenarios: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs GT) గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో IPL 2024 ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల అంచనాలు తారుమారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ప్రయాణం ముగిసింది.

SRH vs GT: హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ రద్దుతో ఢిల్లీ ఔట్‌.. ఒక్క స్థానం కోసం ఆ రెండు జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..

IPL Playoffs Scenario: ఐపీఎల్ 2024 (IPL 2024) 66వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య వర్షం కారణంగా టాస్ లేకుండా రద్దైంది. అదేవిధంగా హైదరాబాద్, గుజరాత్‌లు ఒక్కో పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అదే సమయంలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా హైదరాబాద్‌ నిలిచింది. మరోవైపు, ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ ప్రచారం ముగిసింది. గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసి 12 పాయింట్లతో తన ప్రయాణాన్ని ముగించింది.

MI vs LSG Preview: ముంబైతో పోరుకు లక్నో రెడీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్‌పైనే చూపులన్నీ..

Mumbai Indians vs Lucknow Super Giants Predicted Playing 11: ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ కేవలం 5 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ సమయంలో లక్నో జట్టు 4 సార్లు ముంబై జట్టును ఓడించగా, ఒక్కసారి మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో లక్నో 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. 2022లో వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

MI vs LSG, IPL 2024: విజయంతో ముగించాల్సిందే.. నేడు ముంబై, లక్నోల ఆఖరి పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ

కాగా, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు శుక్రవారం (మే 17 ) జరగనున్న మ్యాచ్‌పై పడింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ముంబై, లక్నో జట్లకు ఇది 14వ మ్యాచ్ అలాగే చివరి మ్యాచ్.

SRH vs GT, IPL 2024: ఉప్పల్‌లో గుజరాత్ తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్

Sunrisers Hyderabad vs Gujarat Titans: ఐపీఎల్‌ 17లో భాగంగా హైదరాబాద్‌-గుజరాత్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దయింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తూ మ్యాచ్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరోక పాయింట్‌ కేటాయించారు.

Tollywood: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టాలీవుడ్ హీరో.. బీసీసీఐ రిప్లై ఏంటంటే?

ప్రస్తుతం దేశమంతాటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ సందడి మొదటి కానుంది. జూన్ 2 నుండి పొట్టి వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటకే టీమిండియాతో పాటు అన్న టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి

SRH vs GT, IPL 2024: హైదరాబాద్‌ను వీడని వర్షం.. మ్యాచ్ నిర్వహణపై HCA కీలక ప్రకటన

ఐపీఎల్ 17వ సీజన్ 66వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ప్లేఆఫ్ పరంగా హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.

IPL 2024: ముంబై ప్లేయర్ల డిష్యుం.. డిష్యుం.. కుస్తీ పట్టిన ఇషాన్, టిమ్ డేవిడ్.. వీడియో వైరల్

IPL 2024 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ కు ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 17న లక్నో సూపర్ జెయింట్‌తో మ్యాచ్ జరగనుంది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం ప్లేఆఫ్స్‌ చేరకుండానే తన ప్రయాణాన్ని ముగించింది.

T20 World Cup 2024: టీమిండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ.. పాక్‌తో మ్యాచ్‌లో గట్టి దెబ్బే పడేలా ఉందిగా!

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి 20 జట్ల మధ్య పొట్టి ప్రపంచ కప్ యుద్దం ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ రెగ్యులర్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది

Dhanashree Verma: బిగ్‌బాస్ లోకి చాహల్ భార్య.. డ్యాన్స్‌లతో హౌజ్‌లో రచ్చ రచ్చే.. షో లాంఛింగ్ ఎప్పుడంటే?

ఇంతకు ముందు కూడా ధనశ్రీకి సల్మాన్ ఖాన్ రియాలిటీ షోలో ఆఫర్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల హౌజ్‌లోకి వెళ్లలేకపోయింది. ఇప్పుడు మరోసారి షో కోసం బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించింది. ధనశ్రీ సోనీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లా జా'లో 'వైల్డ్ కార్డ్' కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. ఆమె హుషారెత్తించిన డ్యాన్స్ లకు జడ్జిలతో పాటు ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు.

Virat Kohli-Sunil Chhetri: ‘నిన్ను చూసి గర్విస్తున్నా’.. స్నేహితుడి రిటైర్మెంట్‌పై కింగ్ కోహ్లీ

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కువైట్‌తో జరగనున్న మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని 39 ఏళ్ల ఛెత్రీ చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసిన సునీల్ ఛెత్రి.. పలు విషయాలపై మాట్లాడాడు.

Saeed Anwar: ‘మహిళలు అలా చేయడం వల్లే విడాకులు’..పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదంలో చిక్కుకున్నాడు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దంపతుల విషయంలో మహిళలనే బాధ్యులుగా చూపిస్తూ అన్వర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు

IPL 2024: ‘కోహ్లీ ఫ్యాన్స్ రాసిపెట్టుకోండి.. ప్లేఆఫ్స్ నుంచి ఆర్‌సీబీ వైదోలిగినట్టే..’

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2024) సీజన్ 17 లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే 65 మ్యాచ్‌లు ముగియగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్లు. మిగిలిన 2 స్థానాల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్..

SRH vs GT Preview: ప్లే ఆఫ్ రేసులో హైదరాబాద్.. గుజరాత్‌తో కీలక మ్యాచ్.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

Sunrisers Hyderabad vs Gujarat Titans: హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ రేసులో బలంగా ఉంది. 12 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్‌కు చేరుకోవాలని SRH కోరుకుంటోంది. అదే సమయంలో, గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. జట్టు విజయంతో సీజన్‌ను ముగించాలని ప్రయత్నిస్తుంది. గుజరాత్ జట్టు 13 మ్యాచుల్లో 11 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

RR vs PBKS: శామ్ కుర్రాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం.. వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్

Rajasthan Royals vs Punjab Kings, 65th Match: ఐపీఎల్-2024 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో 5వ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. జట్టు 10 పాయింట్లు సాధించింది. మరోవైపు ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

Latest Articles