‘ ఏనుగుల ఫ్యామిలీ ‘.. హోటల్లో బ్రేక్ ఫాస్ట్.. వావ్ !

ఆఫ్రికాలోని జాంబియాలో పొద్దున్నే ఓ హోటల్లోకి ఎంటరయ్యారు కొందరు కస్టమర్లు, టూరిస్టులు.. ఆకలితో నకనకలాడే కడుపులతో ఫుడ్ కి ఆర్దరిచ్చారు. అంతే ! ఎక్కడినుంచి వచ్చాయో గానీ, రెండు పెద్ద ఏనుగులు, ఓ గున్న ఏనుగు.. ఆ హోటల్లో చొరబడ్డాయి. టేబుళ్ల మీదున్న డిష్ లను తొండాలతో లాగించేశాయి. వాటి ‘ దూకుడు ‘ చూసి.. మనవాళ్ళు ఎటూ కదలలేక, మాట్లాడలేక.. కుర్చీల్లో కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే బొమ్మల్లా ఉండిపోయారు. వీళ్ళలో అమెరికన్లూ ఉన్నారు.. వాళ్లయితే మరీ బిక్కచచ్చిపోయారు. […]

' ఏనుగుల ఫ్యామిలీ '.. హోటల్లో బ్రేక్ ఫాస్ట్.. వావ్ !
Follow us

|

Updated on: Dec 12, 2019 | 7:07 PM

ఆఫ్రికాలోని జాంబియాలో పొద్దున్నే ఓ హోటల్లోకి ఎంటరయ్యారు కొందరు కస్టమర్లు, టూరిస్టులు.. ఆకలితో నకనకలాడే కడుపులతో ఫుడ్ కి ఆర్దరిచ్చారు. అంతే ! ఎక్కడినుంచి వచ్చాయో గానీ, రెండు పెద్ద ఏనుగులు, ఓ గున్న ఏనుగు.. ఆ హోటల్లో చొరబడ్డాయి. టేబుళ్ల మీదున్న డిష్ లను తొండాలతో లాగించేశాయి. వాటి ‘ దూకుడు ‘ చూసి.. మనవాళ్ళు ఎటూ కదలలేక, మాట్లాడలేక.. కుర్చీల్లో కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే బొమ్మల్లా ఉండిపోయారు. వీళ్ళలో అమెరికన్లూ ఉన్నారు.. వాళ్లయితే మరీ బిక్కచచ్చిపోయారు. ఆ ‘ ముగ్గురు సభ్యుల ‘ భారీ గజరాజుల కుటుంబం.. తమకు దొరికినంత ఫుడ్ లాగించేసి.. తాపీగా అక్కడి నుంచి నిష్క్రమించాయి.

అవి అటు వెళ్ళిపోగానే.. ‘ బతుకు జీవుడా ‘ అనుకుంటూ కస్టమర్లంతా బయటకు పరుగో పరుగు ! ఏనుగులకు కళ్ళు సరిగా కనబడవని, మనిషి భయపడి పరుగు తీసినా, గట్టిగా అరిచినా అవి పసిగట్టి వెంట బడతాయని ఎవరో ‘ గజరాజ నిపుణులు ‘ చెప్పారట.. అందుకే ఆ హోటల్లోకి వఛ్చిన వారంతా భయంతో శిలల్లా ఉండిపోయారట. దగ్గరలో ఉన్న అడవి నుంచి ఈ ఏనుగులు వచ్చిఉంటాయని భావిస్తున్నారు.