జోంబీ సెల్స్..అవి డేంజర్ ‘ బెల్సే ‘ !

మనిషిలో వృద్ధాప్య చాయలు ఎప్పుడు కనిపిస్తాయి ? వయస్సు మీద పడినప్పుడా ? కాదు..కాదంటున్నారు రీసెర్చర్లు. మానవుల శరీరంలో అంతర్గతంగా ‘ సస్పెండెడ్ యానిమేషన్ ‘ లో ఉన్నట్టుండే కణజాలమే ‘ జోంబీ సెల్స్ ‘. జోంబీలు (నరరూప రాక్షసులు) గా మారిన పాత్రల్లో నటులను ఎక్కువగా హారర్ హాలీవుడ్ మూవీల్లో చూస్తాం. తాజాగా అలాంటి పోకడలతోనే ఈ జోంబీ సెల్స్ ఉంటాయని మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ఇవి శరీరంలో ‘ పెట్రేగితే ‘.. ముసలితనం […]

జోంబీ సెల్స్..అవి డేంజర్ ' బెల్సే ' !
Follow us

|

Updated on: May 16, 2019 | 5:58 PM

మనిషిలో వృద్ధాప్య చాయలు ఎప్పుడు కనిపిస్తాయి ? వయస్సు మీద పడినప్పుడా ? కాదు..కాదంటున్నారు రీసెర్చర్లు. మానవుల శరీరంలో అంతర్గతంగా ‘ సస్పెండెడ్ యానిమేషన్ ‘ లో ఉన్నట్టుండే కణజాలమే ‘ జోంబీ సెల్స్ ‘.
జోంబీలు (నరరూప రాక్షసులు) గా మారిన పాత్రల్లో నటులను ఎక్కువగా హారర్ హాలీవుడ్ మూవీల్లో చూస్తాం. తాజాగా అలాంటి పోకడలతోనే ఈ జోంబీ సెల్స్ ఉంటాయని మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
ఇవి శరీరంలో ‘ పెట్రేగితే ‘.. ముసలితనం ఇట్టే వచ్చేస్తుందట. వీటిని తొలగిస్తే..వృద్ధాప్య చాయలు చాలావరకు మాయమవుతాయని మిన్నెసోటా రోచెస్టర్ లోని ఓ పాపులర్ క్లినిక్ డాక్టర్ జేమ్స్ కిర్క్ లాండ్ కూడా ధృవీకరించారు. ఈ కణజాలాన్నే సెన్సెస్ టెంట్ సెల్స్ అని కూడా వ్యవహరిస్తారని ఆయన వివరించారు. నార్మల్ గా మొదలయ్యే ఇవి మెల్లగా ఉత్తేజితమై డీ ఎన్ ఏ లేదా వైరల్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇవి డెడ్ సెల్స్ లా కనిపించినా.. సుషుప్తా వస్థలో ఉన్న స్థితిలో జీవించే ఉంటాయని డాక్టర్ జేమ్స్ పీర్కొన్నారు. ఈ కణాలు సాధారణ కణాలకు హాని చేస్తాయని, అప్పుడే శరీరంలో ‘ ట్రబుల్ ‘ మొదలవుతుందని ఆయన చెబుతున్నారు. ముసలి ఎలుకలపై తాము చేసిన ప్రయోగాలను బట్టి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు జేమ్స్ చెప్పారు. సెనోలిటిక్స్ వంటి మందులు జోంబీ సెల్స్ ను నాశనం చేయగలవు. దీంతో ముసలితనం రాకుండా చూడవచ్చు.. అదే సమయంలో ఈ హానికారక కణాల కారణంగా హార్ట్, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయి. కండరాలు వదులై శరీరంలో నీరసం, ఇతర రుగ్మతలు ఏర్పడతాయి అని ఆయన పేర్కొన్నారు. కిర్క్ లాండ్, ఆయన సహచరులు 14 మంది ఇడియోపథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ రోగులపై సెనో లిటిక్స్ మందును వాడి చూసినప్పుడు మంచి ఫలితం కనిపించినట్టు తేలింది. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారికి ఈ మందు సంజీవని వంటిదని అంటున్నారు. తమ అధ్యయన ఫలితాలను వీరు ఓ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..