డ్రోన్లతో ఫుడ్ డెలివరీ: జొమాటో

ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రానున్న రోజుల్లో డ్రోన్ల సాయంతో నేరుగా ఫుడ్ డెలివరీ చేసే అవకాశముంది. ఇప్పటికే కంపెనీ ట్రయల్స్ కూడా పూర్తిచేసింది. బుధవారం కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్‌గావ్‌కు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగిల్‌ను కొనుగోలు చేసింది. డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ విషయానికి వస్తే.. ఇది 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రోన్‌ గంటకు […]

డ్రోన్లతో ఫుడ్ డెలివరీ: జొమాటో
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2019 | 3:41 PM

ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రానున్న రోజుల్లో డ్రోన్ల సాయంతో నేరుగా ఫుడ్ డెలివరీ చేసే అవకాశముంది. ఇప్పటికే కంపెనీ ట్రయల్స్ కూడా పూర్తిచేసింది. బుధవారం కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్‌గావ్‌కు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగిల్‌ను కొనుగోలు చేసింది. డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

డ్రోన్ విషయానికి వస్తే.. ఇది 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రోన్‌ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదు. డ్రోన్ సేవలతో స్విగ్గీ, ఉబెర్ ఈట్స్ వంటి కంపెనీలకు పోటీ మరింత పెరిగే అవకాశముంది.

https://twitter.com/deepigoyal/status/1138761339709448192