‘కమిన్స్‌ను చూసి యువ బౌలర్లు నేర్చుకోవాలి’

ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్. ఎన్నో అంచనాల నడుమ మొదటి మ్యాచ్ ఆడిన అతడు...

'కమిన్స్‌ను చూసి యువ బౌలర్లు నేర్చుకోవాలి'
Follow us

|

Updated on: Sep 27, 2020 | 6:12 PM

Yuvraj Singh Praises Pat Cummins: ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్. ఎన్నో అంచనాల నడుమ మొదటి మ్యాచ్ ఆడిన అతడు.. ధారాళంగా పరుగులు ఇచ్చి అందరిని నిరాశపరిచాడు. అయితే శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడమే కాకుండా బెయిర్‌స్టో వికెట్‌ను తీశాడు. కేకేఅర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కమిన్స్ ప్రదర్శనపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించాడు.

కమిన్స్‌ను చూసి యువ బౌలర్లు ఎంతగానో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌కు తిరిగి లయ అందుకోవడంలో కమిన్స్ తీరు అద్భుతమని కొనియాడాడు. ఇలాగే చాలామంది యువ బౌలర్లు తొలినాళ్లలో ఇబ్బంది పడతారని.. అలా అని చెప్పి నిరాశపడకూడదని.. వాళ్లు బంతితో తిరిగి ఎలా రాణించాలో కమిన్స్‌ను చూసి నేర్చులోవాలని అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..