వింటేజ్ యూవీ ఈజ్ బ్యాక్

ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ అభిమానులను మురిపించాడు. తనదైన శైలిలో రివర్స్‌ స్వీప్‌ సిక్సర్‌తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి వైవిధ్యమైన షాట్‌ చూసిన ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో వెంటనే ఆ సిక్సర్ల వీడియోను సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. మాలెలోని ఎకువేణి స్పోర్ట్స్‌ మైదానంలో ఎయిర్‌ ఇండియా, మాల్దీవుల జట్టు స్నేహ పూర్వక మ్యాచ్‌ ఆడాయి. ఎయిర్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యువీ స్పిన్నర్‌ వేసిన బంతిని […]

వింటేజ్ యూవీ ఈజ్ బ్యాక్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 9:22 PM

ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ అభిమానులను మురిపించాడు. తనదైన శైలిలో రివర్స్‌ స్వీప్‌ సిక్సర్‌తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి వైవిధ్యమైన షాట్‌ చూసిన ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో వెంటనే ఆ సిక్సర్ల వీడియోను సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

మాలెలోని ఎకువేణి స్పోర్ట్స్‌ మైదానంలో ఎయిర్‌ ఇండియా, మాల్దీవుల జట్టు స్నేహ పూర్వక మ్యాచ్‌ ఆడాయి. ఎయిర్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యువీ స్పిన్నర్‌ వేసిన బంతిని అద్భుతమైన రీతిలో సునాయాసంగా రివర్స్ ‌స్వీప్‌ చేశాడు. బంతి అలవోకగా బౌండరీ అవతల పడింది. ఇటువంటి షాట్లు యూవీకి కొత్తేమి కాదు..కానీ కాన్సర్ భారిన పడి కోలుకున్న తర్వాత యూవీ ఆటతీరులో మ్యాజిక్ అయ్యింది. తాజాగా అతను ఓల్డ్ ఫేజ్ స్టైల్ రుచి చూపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవదుల లేవు. భారత్‌, మాల్దీవుల సంబంధాలు మరింత పటిష్ఠం చేసేందుకు ఈ పోటీ నిర్వహించారు. మ్యాచ్‌ తర్వాత యువీ మాట్లాడాడు.

‘రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు క్రికెట్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. మూడేళ్లుగా యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికకావడం లేదు. గత ఐపీఎల్‌లో విఫలమైన అతడు విదేశాలకు వెళ్లి ఫిట్‌నెస్‌ సంతరించుకున్నాడు. నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు