వరద బాధితుల సేవలో పఠాన్ సోదరులు

Yusuf Pathan, వరద బాధితుల సేవలో పఠాన్ సోదరులు
ప్రస్తుతం గుజరాత్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వడోదర నగరమైతే అస్తవ్యస్తమైంది. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఆపన్నహస్తం అందించే వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు టీమిండియా క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ సోదరులు ముందుకొచ్చారు. ఆహారం లేక అల్లాడిపోతున్న వారి ఆకలి తీర్చారు. బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. బాధితులకు యూసుఫ్ పఠాన్ స్వయంగా ఆహారం వడ్డించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు బాలికలు ఓ హాస్టల్‌లో చిక్కుకుపోయి ఆహారం కోసం అలమటిస్తున్నారంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఇర్ఫాన్ స్పందించాడు. రెండు గంటల్లోపే ఇర్ఫాన్ పఠాన్ బృందం బాధిత బాలికలు చిక్కుకున్న హాస్టల్‌కు చేరుకుని రక్షించి ఆహారం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *