అమరావతి భూములపై వైసీపీ వీడియో ప్రజంటేషన్.. వివరాలివే..!

రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. అమరావతి భూములపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చిన వైసీపీ.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ రిపోర్ట్‌ను పక్కన పెట్టారని అన్నారు. తక్కువ రేట్లకు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని.. ల్యాండ్ పూలింగ్ భూమలకు బదులుగా ఇచ్చే ఫ్లాట్లలో కూడా అవినీతి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. మొత్తం 4069.95 ఎకరాలు రాజధానిలో కొనుగోలు […]

అమరావతి భూములపై వైసీపీ వీడియో ప్రజంటేషన్.. వివరాలివే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2020 | 9:07 PM

రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. అమరావతి భూములపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చిన వైసీపీ.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ రిపోర్ట్‌ను పక్కన పెట్టారని అన్నారు. తక్కువ రేట్లకు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని.. ల్యాండ్ పూలింగ్ భూమలకు బదులుగా ఇచ్చే ఫ్లాట్లలో కూడా అవినీతి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు.

మొత్తం 4069.95 ఎకరాలు రాజధానిలో కొనుగోలు చేశారని.. ఇన్నర్ రింగ్ రోడ్‌కు కూడా భూములకు అనుకూలంగా కొనుకున్నారని వారు తెలిపారు. 800 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారని.. ఇందులో 60 మంది హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారని వైసీపీ నేతల ఆ వీడియోలో పేర్కొన్నారు. రాజధాని ప్రకటన అనంతరం కూడా భూములు కొనుగోలు చేశారని.. తర్వాత సీఆర్డీఏ పరిధిని పెంచి భూమి విలువలు పెంచారని వారు అన్నారు. లింగమనేనికి లబ్ది చేకూర్చి ఆయన గెస్ట్ హౌస్‌ను తీసుకున్నారని వైసీపీ నేతలు ఆ వీడియోలో ఆరోపించారు.