పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..

YSRCP Mla Roja Slams Pawan Kalyan On His Comments, పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..

సీఎం జగన్ వందరోజుల పాలనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. ఇప్పుడు జగన్ పాలనపై బుక్ రిలీజ్ చేసిన పవన్.. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో జరిగిన అవకతవకలపై ఎందుకు బుక్ విడదల చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అన్నారు. కేవలం వంద రోజుల్లో జగన్ అనేక సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చంద్రబాబే పవన్ కళ్యాణ్‌తో విమర్శలు చేయిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో పవన్ కల్యాణ్ విడుదల చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పై స్పష్టత ఇవ్వాలంటూ మూడ్రోజుల పాటు ఏపీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *