ప్రభుత్వ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

ప్రభుత్వ అధికారులపై విజయనగరం జిల్లా సాలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలుగా తనకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష సమావేశంలో ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అధికారులు ఇబ్బందిపెట్టారని.. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రశ్నించారు. ఆరు నెలలుగా పాస్ […]

ప్రభుత్వ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 4:16 PM

ప్రభుత్వ అధికారులపై విజయనగరం జిల్లా సాలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలుగా తనకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష సమావేశంలో ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అధికారులు ఇబ్బందిపెట్టారని.. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రశ్నించారు. ఆరు నెలలుగా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారన్నారు. రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. రాజన్న దొరకు మంత్రులు సర్థిచెప్పడంతో కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.

గతవారమే ఏసీబీ అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీవాళ్లు దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారని.. ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ వ్యాఖ్యల్ని మర్చిపోకముందే మళ్లీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అధికారులపై ఫిర్యాదు చేయడంపై ఏపీలో చర్చ మొదలయ్యింది.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..