వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన భావోద్వేగం

YSRCP MLA Darmana Krishna Das, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన భావోద్వేగం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ పాఠశాలలో ఎదిగి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నాలుగు పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్ అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన కంటతడి పెట్టారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడిగా.. కష్టాల్లో ఉన్న జగన్‌కు అండగా ఉంటానన్న సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత కేబినేట్‌లో తనకు స్థానం కల్పిస్తే మాత్రం తప్పక ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *