రాజన్న గుర్తొచ్చారు: వైసీపీ నేతల్లో ఙ్ఞాపకాలు

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. 2004 మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా మొదటిసారిగా ప్రమాణం చేశారు. ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి, ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్సార్.. ఇదే రోజున అధికారం చేపట్టి.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి.. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, జలయఙ్ఞం, 108, 104వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఈ పథకాలే ఆయన రెండోసారి […]

రాజన్న గుర్తొచ్చారు: వైసీపీ నేతల్లో ఙ్ఞాపకాలు
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 4:43 PM

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. 2004 మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా మొదటిసారిగా ప్రమాణం చేశారు. ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి, ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్సార్.. ఇదే రోజున అధికారం చేపట్టి.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి.. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, జలయఙ్ఞం, 108, 104వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఈ పథకాలే ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సహకరించాయి. కాగా వైఎస్సార్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో వైసీపీ పార్టీ నేతలు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

అన్ని వర్గాలకు అండగా ఉండే పథకాల కోసం ఇదే రోజున సమున్నత అధ్యయనం ప్రారంభమైందని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఏదైనా ఓ పథకం గురించి ఆలోచించేలోపే.. వైఎస్ దాన్ని చేసి చూపేవారని, పేదల కోసం ఎంతటి క్లిష్టమైన పథకాన్నైనా వైఎస్ అమలు చేసేవారని ఆయన అన్నారు.

ఉచిత విద్యుత్, బకాయిలను మాఫీ చేసి చూపిన ఘనత రాజశేఖర్ రెడ్డిదేనని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పేదల కష్టాన్ని చూస్తే వెంటనే వైఎస్ చలించేవారని.. తానున్నానన్న భరోసాను అన్ని వర్గాలకు కల్పించారని అన్నారు. వైఎస్ ఆధ్వర్యంలోనే ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు జరిగి, పనులు పూర్తయ్యాయని అన్నారు. ఇక ప్రతి పేదను సొంతింటికి దగ్గర చేయాలని, గుడిసెలు లేని రాష్ట్రాన్ని చూడాలని ఆయన కలలు కనేవారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా నష్టం కలుగుతుందని తెలిసినా, ప్రజల కోసం ముందడుగు వేసేవారని.. అలాంటి నేతను తాను చూడలేదని పేర్కొన్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.