ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఇకపై “ఫైవ్ స్టార్” హెటల్స్‌లోనే..

CM Jagan Power Punch On Liquor Ban, ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఇకపై “ఫైవ్ స్టార్” హెటల్స్‌లోనే..

మద్యాన్ని దశల వారీగా అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలు నడిపేందుకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం నిషేదంలో ఏపీ సర్కార్ ఒక అడుగు ముందుంది. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని విడతల వారీగా నిషేదిస్తూనే.. ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ మద్యం షాపులను రద్దు చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *