తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటలకు ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లకు పైగా కేటాయింపులు జరుపుతున్నట్లు బుగ్గన వెల్లడించారు.

ఏ పథకానికి ఎన్ని కోట్లు..

విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు
గిడ్డంగుల కోసం రూ. 200 కోట్లు
వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు రూ. 109 కోట్లు
రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ. 100 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 8750 కోట్లు
అమ్మఒడికి రూ. 6455 కోట్లు
రూ. 2002 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి
వైఎస్సార్ పీఎం ఫసల్ బీమాకు రూ. 1163 కోట్లు
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ రూ. 475 కోట్లు
బోర్ రిగ్గుల కోసం రూ. 200 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.798 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.329 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 13,139 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.6861 కోట్లు
పరిశ్రమలకు రూ. 3986 కోట్లు
విద్యా రంగానికి రూ.32,618 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులు రూ.329 కోట్లు
సాంకేతిక విద్య రూ.580 కోట్లు
కళలు, సాంస్కృతిక విభాగానికి రూ.77 కోట్లు

వైద్య రంగానికి రూ.11399 కోట్లు
మంచి నీరు, మురుగు నీటి నిర్వహణకు రూ.2234 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.6587 కోట్లు
2018-19 సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్ రూ.1,62,134 కోట్లు
గత బడ్జెట్ కంటే 19 శాతం పెంపు
రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు
రెవెన్యూ లోటు అంచనా రూ.1778 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 0.17 శాతం
ద్రవ్య లోటు అంచనా రూ. 35, 260 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.30 శాతం
మూల ధన వ్యయం రూ. 32,293 కోట్లు
చెల్లించాల్సిన అప్పులకు కేటాయింపు రూ.8994 కోట్లు

పట్టణాభివృద్ధి రూ.6597 కోట్లు
సమాచారం, ప్రజా సంబంధాలు: రూ.191కోట్లు
సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు
కార్మిక, ఉపాధి రంగాలకు రూ.978 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2707 కోట్లు
సాధారణ సేవలు రూ.66,324 కోట్లు
రాష్ట్రాభివృద్ధి పథకాలకు రూ.92,050కోట్లు(+87శాతం)
ఎస్సీల అభివృద్ధికి రూ.15వేల కోట్లు(+33శాతం)
ఎస్టీల అభివృద్ధికి రూ.4988కోట్లు(+19శాతం)
వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రూ. 15,061కోట్లు(+23శాతం)

ఆరోగ్య శ్రీ కోసం రూ.1740 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సహకారం రూ.1150 కోట్లు
వైఎస్సార్ బీమా రూ.404కోట్లు
సొంత ఆటో కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహకారం రూ.400 కోట్లు
వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
చేనేత కార్మికులకు వైఎస్సార్ ఆర్థిక సహకారం రూ.200 కోట్లు
మతపరమైన సంస్థలకు వైఎస్సార్ గ్రాంట్ రూ.234 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు
సబ్సిడీ బియ్యానికి రూ.3వేల కోట్లు
పౌరసరఫరాల కార్పోరేషన్‌కు రూ.384 కోట్లు
గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు
గ్రామ సచివాలయాలకు రూ.700 కోట్లు
మున్సిపల్ వార్డ్ వాలంటీర్లకు రూ.280 కోట్లు
మున్సిపల్ వార్డ్ సచివాలయాలకు రూ.180 కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.31,564 కోట్లు
రెవెన్యూ శాఖకు రూ.9496 కోట్లు
రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగానికి రూ.145 కోట్లు
రోడ్డు, రవాణా, భవనాలకు రూ.6202 కోట్లు
మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.2689 కోట్లు

రాజధాని అమరావతి కోసం రూ.500 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *