సిట్ వద్దు..సీబీఐ కావాలి.. వివేకా తనయ డిమాండ్‌..

వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను చేర్చారు సునీత. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లతో పాటు తాజాగా సునీత కూడా పిటిషన్ వేయడంతో…అన్ని పిటిషన్లపై విచారించిన హైకోర్టు […]

సిట్ వద్దు..సీబీఐ కావాలి.. వివేకా తనయ డిమాండ్‌..
Follow us

|

Updated on: Jan 28, 2020 | 7:09 PM

వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను చేర్చారు సునీత. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లతో పాటు తాజాగా సునీత కూడా పిటిషన్ వేయడంతో…అన్ని పిటిషన్లపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇంకో 25 రోజులు ఉన్నాయనగా వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తూ ఉండగా..గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై వేట కొడవళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ కేసులో ఏర్పాటైన సిట్ ఇప్పటికి  1400 మందిని విచారించినప్పటికి, హత్య ఎవరు చేశారనేదానిపై కనీసం వివరాలు సంపాదించలేకపోయింది.