Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కేటీఆర్ ఆదేశాలతో నటి మీరాచోప్రా ఫిర్యాదు ఫై దర్యాప్తు ముమ్మరం . మీరాచోప్రా ను ట్రోల్ చేసిన 15 ట్విటర్ హ్యాండిల్స్ గుర్తింపు . 15 మందికి నోటీసులు పంపిన పోలిసులు. అసభ్యం గా ట్వీట్ చేసిన 15 మంది ని అరెస్ట్ చేసే అవకాశం.
  • 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫై ఈరోజు హై కోర్ట్ లో విచారణ . 10 వ తరగతి పరీక్షలపై తీర్పు ఇవ్వనున్న హై కోర్ట్. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసామన్న ప్రభుత్వం . సప్లమెంటరీ లో పాస్ అవుతే రెగుయిలర్ పాస్ అవుట్ లో చేరుస్తారా లేదా అన్న దాని ఫై క్లారిటీ ఇవ్వనున్న ప్రభుత్వం.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్. కోర్ట్ అనుమతితో ఆసుపత్రి నుంచి డుశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్.
  • తిరుపతి: టిటిడి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణ ని సస్పెండ్ చేసిన జేఈవో బసంత్ కుమార్. సప్తగిరి పత్రికలో కుసుడు ఆర్టికల్ ను ప్రచురించి ఉద్దేశపూర్వకంగా టిటిడి ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణాలతో సస్పెన్షన్. 2016లో నిషేధించిన కథనాన్ని పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలడంతో సస్పెన్షన్. సప్తగిరి పత్రిక వివాదం పై విచారణ కొనసాగుతోందన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
  • లంగర్ హౌజ్ డబల్ మర్డర్ కేసును ఛేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ ఆర్షద్, ఇద్దరు వ్యక్తులు. రౌడీ షీటర్ చంద్, స్నేహితుడు అబూ లను కత్తులో నరికి చంపిన ఆర్షద్ అండ్ గ్యాంగ్. క్వాలిస్ వాహనం లో ఆరుగురు ఉన్నట్టు గుర్తింపు. ఫరారి లో మరో ముగ్గురు, ముంబై వైపు వెళ్లినట్టు అనుమానం. పాత కక్ష్యలో తో నే హత్య చేసినట్టు గా తేల్చిన పోలీసులు.

బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

YS viveka murder case accused commits suicide, బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలిచారని.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తనకు హత్యతో సంబంధం లేదని మూడు లెటర్లు రాసిన శ్రీనివాస్ రెడ్డి.. సిట్ సీఐ శ్రీరామ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడైన కసునూరి పరమేశ్వర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి బావమరిది.

Related Tags