‘నాలో..నాతో.. వైఎస్సార్’.. విజయమ్మ రచన..

'నాలో..నాతో.. వైఎస్సార్' పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పుస్తకం రాశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ 37 ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం...

'నాలో..నాతో.. వైఎస్సార్'.. విజయమ్మ రచన..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 9:36 AM

‘నాలో..నాతో.. వైఎస్సార్’ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పుస్తకం రాశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ 37 ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారంగా ఈ పుస్తకాన్ని రచించారు. మహానేతను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు విజయమ్మ తెలిపారు.

ఆత్మీయ ‘శేఖరుడు…’ మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని రచించినట్లు విజయమ్మ తన పుస్తకం ముందుమాటలో రాసుకున్నారు. వైఎస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా ఎలా ఉండేవారో ఈ పుస్తకంలో క్లుప్తంగా వివరించారు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా… నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో.. విజయమ్మ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు.

వారి కోసం ఈ ‘నా’ పుస్తకం…

రాబోయే తరాలు కూడా వైఎస్సార్ గురించి తెలుసుకుని, స్ఫూర్తి పొందుతారన్న ఉద్దేశంతోనే ‘నాలో.. నాతో… వైఎస్సార్’ రచనను చేపట్టానని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్సార్ జయంతి అయిన జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాన్నిఎమ్మెస్కో పబ్లికేషన్స్ ముద్రించింది. (జులై 08) బుధవారం నుంచి అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో ఇది లభ్యమవుతుందని ప్రచురణకర్తలు తెలిపారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??