విజయమ్మ భావోద్వేగం.. కంటతడి

ఏపీ నూతన సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘నన్ను దీవించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతఙ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ భావోద్వేనికి గురయ్యారు. ఆయనను హత్తుకొని ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. వేదికపై ఉన్నవారు, టీవీలో చూస్తున్న వారికి ఈ సన్నివేశం ఉద్వేగాన్ని కల్పించింది.

Also Read: లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *