పోలవరం రివర్స్ టెండరింగ్‌ సక్సెస్..వైఎస్ షర్మిల ట్వీట్!

Reverse Tendering of Polavaram, పోలవరం రివర్స్ టెండరింగ్‌ సక్సెస్..వైఎస్ షర్మిల ట్వీట్!

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ‘పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65 వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి 58కోట్ల ఆదా అయినందుకు గర్వపడుతున్నా’  అంటూ షర్మిల ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్‌కి మిషన్ పోలవరం అనే హెడ్డింగ్‌తో అసెంబ్లీలో జగన్ పోలవరంపై మాట్లాడిన స్పీచ్‌ను కూడా జత చేశారు.

కాగా జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పార్టీని ముందుడి నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి..కార్యకర్తల్లో ధైర్యం నింపారు. గత ఎన్నికలకు ముందు కూడా ఆమె ప్రచారంలో విసృతంగా పాల్గొన్నారు. ఫలితాల వచ్చి జగన్ సీఎం అయిన తర్వాత పెద్దగా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమెకు జగన్ కీలక పదవి ఇస్తారన్న వార్తలు వచ్చినా కూడా అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు తాజగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానం సక్సెస్ అవ్వడంతో వైఎస్ షర్మిల స్పందించారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు సత్పలితాలను ఇచ్చింది. ఒకవైపు కేంద్ర హెచ్చరిస్తున్నా..మరోవైపు ప్రతిపక్షం ఎద్దేవా చేస్తున్నా వెనక్కి తగ్గని సీఎం రివర్స్ టెండరింగ్‌లో ముందడుకు వేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. 65వ నంబరు ప్యాకేజీ పనుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో ఏకంగా 58.53 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేయడమే కాకుండా గతంలో పనులు తీసుకున్న కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. జగన్ విజయంతో.. దటీజ్ సీఎం జగన్ సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *