ఏపీని ఆదుకోండి.. మోదీతో జగన్..

YS Jaganmohan Reddy meets PM Modi, ఏపీని ఆదుకోండి.. మోదీతో జగన్..

ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యారు. ఈ నెల 30న తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మోదీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని, కేంద్రం ఆదుకోవాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వినతిపత్రం కూడా అందజేశారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రత్యేక హోదా, దాని ఆవశ్యకత గురించి మోదీకి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక ఆర్థిక సాయం పలు అంశాలపై మోదీతో చర్చించారు. రాష్ట్రం అన్నివిధాలుగా కష్టాల్లో కూరుకుపోయిందని.. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ఏపీకి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *