పరిశ్రమల ఏర్పాటుకు ఊతం.. అమెరికాలో ఏపీ సీఎం జగన్..

Updates On AP CM Jagan US tour, పరిశ్రమల ఏర్పాటుకు ఊతం.. అమెరికాలో ఏపీ సీఎం జగన్..

పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయదలిస్తే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులు చేస్తుందని ఆయన చెప్పారు. ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని సీఎం అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాదు, పరిశ్రమలకు అవసరమైన భూములు, కరెంటు, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో యూఎస్ ఛాంబర్ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం జగన్‌ హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆరోగ్యరంగాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవవనరులను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *