సీమపై సీఎం ఫోకస్..టార్గెట్ బాలయ్య!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వేవ్ ఎలా కొనసాగిందో తెలిసిందే. జగన్ గాలిలో టీడీపీలోని మహామహా నాయకులు, రాజకీయ ఉద్దండులు పత్తా లేకుండా పోయారు. అరడజనుకు పైగా మినిస్టర్స్ దారుణ ఓటమి చవిచూశారు. మిగిలిన రాష్ట్రమంతటా పక్కనపెడితే.. ముఖ్యంగా రాయలసీమలో జగన్ సింహనాదం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయగా…చిత్తూరులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు…అనంతపురంలో నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌లు సీమ నుంచి టీడీపీ తరుపున గెలుపొందారు. ఒక ప్రాంతంలో ఈ […]

సీమపై సీఎం ఫోకస్..టార్గెట్ బాలయ్య!
Follow us

|

Updated on: Oct 11, 2019 | 12:35 PM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వేవ్ ఎలా కొనసాగిందో తెలిసిందే. జగన్ గాలిలో టీడీపీలోని మహామహా నాయకులు, రాజకీయ ఉద్దండులు పత్తా లేకుండా పోయారు. అరడజనుకు పైగా మినిస్టర్స్ దారుణ ఓటమి చవిచూశారు. మిగిలిన రాష్ట్రమంతటా పక్కనపెడితే.. ముఖ్యంగా రాయలసీమలో జగన్ సింహనాదం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయగా…చిత్తూరులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు…అనంతపురంలో నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌లు సీమ నుంచి టీడీపీ తరుపున గెలుపొందారు. ఒక ప్రాంతంలో ఈ రేంజ్ వేవ్ రావడం.. రాజకీయ నిపుణులను ఆశ్యర్యచకితులను చేసింది.

జగన్‌ది రాయలసీమ కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉందనడానికి లేదు. ఎందుకంటే..ఆ ప్రాంతం నుంచే రాజకీయాల్లో అపరచాణుక్యుడైన చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా అప్పుడు బాబు అధికారంలో ఉన్నారు. ఏది ఏమైనా ఇది సీమలోని టీడీపీ వర్గాలకు..వ్యక్తిగతంగా చంద్రబాబుకు మింగుడుపడని విషయం.

 స్వీప్‌పై జగన్ ఫోకస్:

కాగా ఇప్పుడు రాయలసీమలో టీడీపీ అస్తిత్వం కోసం పోరాడుతుంటే..వైసీపీ అధినేత జగన్ రాయలువారు ఏలిన ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నారు. గతంలోనే ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సంసిద్దులు అయ్యారనే వార్తలు వినిపించాయి. కానీ కీడెంచి..మేలెంచమన్నట్టుగా చంద్రబాబు అతడికి ప్రోట్‌కాల్ ఉండే.. ప్రతిపక్షానికి లభించే పీఏసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. వాస్తవానికి కేశవ్‌కు ఒక సెంటిమెంట్ ఉంది. అతడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడం..ఒకవేళ అతడు ఓడిపోతే..సదరు పార్టీ గెలుపొందడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకే పీఏసీ ఛైర్మన్ పదవితో అతడు సైలెంట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం వైసీపీ వర్గాలు  హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై టార్గెట్ పెట్టినట్లు సమాచారం. హిందూపూర్‌లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువ. అందుకే బాలయ్యపై పోటీకి కూడా మైనార్టీ వర్గానికి చెందిన, రాయలసీమ రేంజ్‌ మాజీ ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ను నిలబెట్టింది. కానీ ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ మైనార్టీలకు వైసీపీ ఇంపార్టెన్స్ ఇస్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇక్బాల్‌కు ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇక టీడీపీలో ఉండే ద్వితియ శ్రేణి కార్యకర్తలను ఇప్పటికే వైసీపీ తమవైపు తాక్కుంది. ఇక త్వరలోనే మున్నిపల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. వాటిని క్లీన్ స్వీప్ చేసి…సీమ మొత్తం ఫ్యాన్ గాలి వీసేలా చెయ్యాలని జగన్ సేన వ్యూహాలు రచిస్తుంది.