బ్రేకింగ్: మోడీ అడుగుజాడల్లో జగన్.. ఈసారి ఏంచేశాడంటే..?

ఏపీ సీఎం జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్లపాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కార్. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని రెండేళ్ల క్రితమే విశాఖ మన్యంలోని గిరిజనులకు.. జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:27 pm, Thu, 26 September 19
YS Jagan

ఏపీ సీఎం జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్లపాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కార్. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని రెండేళ్ల క్రితమే విశాఖ మన్యంలోని గిరిజనులకు.. జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వారికి ఇచ్చిన హామీ మేరకు.. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.

కాగా.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. అనంతగిరి రిజవర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1, 2, 3, అలాగే.. గాలిగొండ, చిత్తమగొండి, రక్తకొండ గ్రామాల్లో బాక్సైట్ తవ్వాకాలకు బ్రేక్ పడనుంది. సీఎం జగన్ నిర్ణయంపై విశాఖ మన్యం గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తమ పోరాటానికి.. ఫలితం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు.