తండ్రికి జగన్ నివాళి

YS Jagan Mohan Reddy, తండ్రికి జగన్ నివాళి

మూడ్రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయననివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరారు. కాగా కడప జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జగన్ అమీన్ పూర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *