ఏపీ సీఎం సచివాలయ ప్రవేశం వాయిదా

నవ్యాంధ్రప్రదేశ్ రెండో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ ప్రవేశం వాయిదా పడింది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలోకి ఇవాళ అడుగుపెట్టి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాలని జగన్ భావించినప్పటికీ.. సుముహూర్తం లేకపోవడం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే పరిపాలన చేస్తున్నారు. కాగా ఏపీ నూతన డీజీపీగా ఎంపికైన గౌతమ్ సవాంగ్‌ ఇదివరకే ఆయనతో సమావేశమై.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు. మరోవైపు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొందరు […]

ఏపీ సీఎం సచివాలయ ప్రవేశం వాయిదా
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 3:59 PM

నవ్యాంధ్రప్రదేశ్ రెండో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ ప్రవేశం వాయిదా పడింది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలోకి ఇవాళ అడుగుపెట్టి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాలని జగన్ భావించినప్పటికీ.. సుముహూర్తం లేకపోవడం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే పరిపాలన చేస్తున్నారు. కాగా ఏపీ నూతన డీజీపీగా ఎంపికైన గౌతమ్ సవాంగ్‌ ఇదివరకే ఆయనతో సమావేశమై.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు. మరోవైపు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొందరు ఉన్నతాధికారులు ఆయన నివాసంలోనే కలుసుకొని రాష్ట్ర స్థితిగతులపై నివేదికలు సమర్పించారు. ఇదిలా ఉంటే గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. అప్పుడే పరిపాలనలో వేగాన్ని పెంచారు.