Breaking News
  • కీసర ఎమ్మార్వో కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు. ఎమ్మార్వో ఆస్తులు 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎసిబి అంచనా. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన నాగరాజు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా ఆస్తులు కొనుగోలు. ఎమ్మార్వో ని పట్టుకున్న సంఘంలో కోటి ఇరవై ఎనిమిది లక్షలు స్వాధీనం. ఇంటిలో సోదా చేయగా 28 లక్షల రూపాయల నగదు లభ్యం.
  • కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా భారిన పడకుండా రక్షించుకోవచ్చు
  • టుగెద‌ర్ యాజ్ ఒన్ పాట‌ను ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. మంచి కాజ్ కోసం ఈ పాట అంటూ ట్వీట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌. 65 మంది క‌లిసి పాడిన పాట అని ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. 65 మంది గాయ‌కులు, ఐదు భాష‌ల్లో పాడిన పాట.
  • ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం. అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం. స్థానిక జోడిమెట్ల లోని క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ.
  • స్వర్ణ పేలస్ ఫైర్ యాక్సిడెంట్ అగ్నిప్రమాదం పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెసిన హీరో రామ్. రమేశ్ హాస్పిటల్ ఎండీ రమేశ్ కు అన్న కొడుకు హీరో రామ్. పెద్ద కుట్ర జరుగుతోంది.. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలీకుండా చేసే పనులు వాళ్ళమీ రివ్యూటేషన కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోంది. స్వర్ణ పేలస్ ని రమేష్ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోకముందే దాన్ని ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా వినియోగించింది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఎవర్నీ నిందించేవాళ్ళు..హీరో రామ్.
  • రాఘ‌వేంద్ర‌రావు : కేసీఆర్‌గారి స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌గారు త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి. మ‌ట్టి వినాయ‌కుడిని పూజిద్దాం. ప్ర‌కృతిని కాపాడుకుందాం. వినాయ‌కుడు అంటే మ‌న విఘ్నాల‌ను తొల‌గించేవాడు. అందుకే ద‌య‌చేసి పూజ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రూ వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేయొద్దు. ఒక తొట్టిలో వేసి నీరుపోయండి. ఆ మట్టిలో మొక్క పెరుగుతుంది.

ఉపాధి కల్పనే లక్ష్యంగా…ఐటీ, పారిశ్రామిక విధానంలో మార్పులు..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో దూసుకుపోతున్నారు. ఓ వైపు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేస్తూనే...పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఐటీ రంగం గొప్ప మలుపు తిరుగుతుందని, అన్ని యూనివర్సిటీల్లోనూ..
ys jagan mohan reddy high level review industrial policy, ఉపాధి కల్పనే లక్ష్యంగా…ఐటీ, పారిశ్రామిక విధానంలో మార్పులు..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో దూసుకుపోతున్నారు. ఓ వైపు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేస్తూనే…పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కొత్త పారిశ్రామిక విధానం, ఐటీ రంగంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం (జూలై 2)రోజున ఆయన తన క్యాంపు కార్యాలయంలో 2020 – 23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ కల్పన, ప్రాంతాల మధ్య సమత్యులత, పర్యావరణ సానుకూల అభివృద్ధి కేంద్రంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా.. స్థానికంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సూక్ష్మ, చిన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. వాటికి పునరుద్ధరణ, చేయూత ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్బంగా సీఎం జగన్ సూచించారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఉన్నత శ్రేణి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఐటీ రంగం గొప్ప మలుపు తిరుగుతుందని, అన్ని యూనివర్సిటీల్లోనూ ఎక్స్‌టెన్షన్ విధానాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ యూని వర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, బోధన అంశాలపై ప్రఖ్యాత ఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విదేశీ పెట్టుబడులు సాధించడంపైనా దృష్టి సారిస్తున్నామని, ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ, చేయూతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జగన్ ఆదేశించారు.

ఓ వైపు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తూనే…మరోవైపు పరిశ్రమల వల్ల కలిగే అనర్థాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, కాలుష్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అవశ్యకత కూడా అంతే ముఖ్యమన్నారు. పారిశ్రమలు తప్పని సరిగా కాలుష్య నివారణ చర్యలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులేనని స్పష్టం చేశారు.

Related Tags