చిరంజీవికి సీఎం జగన్ బంపర్ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా.. సైరా.. సైరా.. సైరా నరసింహా రెడ్డి.. ఇదే హవా నడుస్తోంది. చిన్న పిల్లల దగ్గరుంచి.. యంగ్ పీపుల్ వరకూ.. ‘సైరా ఫీవర్’ పట్టుకుందంటే అతిశయోక్తి కాదు. అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా రిలీజ్‌ అయిన ఈ సినిమా.. మంచి పవర్‌ ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌‌ని షేక్ చేసింది సైరా మూవీ. ఈ మూవీ షెడ్యూల్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే.. వారం రోజులకి.. అన్ని థియేటర్స్ ఫుల్‌గా […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:48 am, Wed, 2 October 19
చిరంజీవికి సీఎం జగన్ బంపర్ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా.. సైరా.. సైరా.. సైరా నరసింహా రెడ్డి.. ఇదే హవా నడుస్తోంది. చిన్న పిల్లల దగ్గరుంచి.. యంగ్ పీపుల్ వరకూ.. ‘సైరా ఫీవర్’ పట్టుకుందంటే అతిశయోక్తి కాదు. అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా రిలీజ్‌ అయిన ఈ సినిమా.. మంచి పవర్‌ ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌‌ని షేక్ చేసింది సైరా మూవీ. ఈ మూవీ షెడ్యూల్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే.. వారం రోజులకి.. అన్ని థియేటర్స్ ఫుల్‌గా బుకింగ్ అయిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలతో పాటు.. అన్ని భాషల్లోనూ సైరాపై భారీగా అంచాలు ఉన్నాయి.

కాగా.. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఏపీలో 6 షోలకు అనుమతి అడిగారు సైరా సినిమా దర్శక నిర్మాతలు. అయితే.. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. దీంతో.. బయ్యర్లు పండగ చేసుకుంటున్నారు. ఇక థియేటర్స్‌ వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. చిరంజీవి మ్యానియా.. ఫ్యాన్స్‌లో ఇంకా తగ్గలేదు. ఏదైతేనేం.. మొత్తానికి చిరుకి మళ్లీ.. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ.