Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

పీకే‌ టీమ్ మెంబర్‌కు జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు..!

Jagan appoints Brahmananda Patra as AP Chief digital director, పీకే‌ టీమ్ మెంబర్‌కు జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు..!

ఏపీలో జగన్ సర్కారులో మరో ఇద్దరు భాగమయ్యారు. సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే ఇద్దరిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార పౌర సరఫరాల శాఖలోని సోషల్ మీడియా విభాగంలో వీరిద్దరు విధులు నిర్వహించనున్నారు. గతంలో గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా జగన్ ప్రభుత్వం నియమించగా.. ఇప్పుడు మరో ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పుడు నియమించిన ఇద్దరిలో బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ సభ్యుడు కావడం విశేషం.

అయితే వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వెనుక ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహాలు ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ డిజిటల్ సపోర్ట్, స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. ఈ క్రమంలో జగన్‌ టూర్లపై పాటలు విడుదల చేయడం, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం, వారి వ్యాఖ్యలకు దీటుగా బదులివ్వడం లాంటి బ్యాక్ గ్రౌండ్ వ్యవహారాలను ఆయన నిర్వహించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ బీహార్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి వైసీపీకి ఐప్యాక్ నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి సేవలు అందించడం లేదు. అయితే ఇప్పుడు ఐప్యాక్‌లో ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక జగన్ వ్యూహం ఉందని పలువురు భావిస్తున్నారు.