సీబీఐ కోర్టుకు జగన్.. విచారణ వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారి ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో జగన్‌ను దాదాపు రెండు గంటల పాటు కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌లు అన్ని కలిపి ఒకే సారి విచారించాలని సీబీఐ కోర్టును కోరారు జగన్. ఆయన తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరుఫున సురేందర్ వాదనలు […]

సీబీఐ కోర్టుకు జగన్.. విచారణ వాయిదా
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2020 | 2:07 PM

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారి ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో జగన్‌ను దాదాపు రెండు గంటల పాటు కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌లు అన్ని కలిపి ఒకే సారి విచారించాలని సీబీఐ కోర్టును కోరారు జగన్. ఆయన తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరుఫున సురేందర్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది కోర్టు. కాగా ఆయనతో పాటు ఎంపీ విజయ సాయి రెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.

అయితే అక్రమాస్తుల కేసులో జగన్‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో కొన్ని సంవత్సరాలుగా కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు జగన్. చివరిసారిగా గతేడాది మార్చి 1న ఆయన హాజరయ్యారు. అయితే ఆ తరువాత ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇలా వరుసగా జరిగాయి. ఈ క్రమంలో వ్యక్తిగత మినహాయింపు నుంచి వాయిదాలు కోరుతూ వచ్చారు. అయితే ఇటీవల ఈ కేసులో జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో సీఎం అయ్యాక తొలిసారి ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.