Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • కరోనా తోచనిపోయిన మృతదేహాలను మతంతో సంబంధం లేకుండా దహనం చేయాలి. ఖననం(పూడ్చి పెట్టడం) అనుమతించబడదు. అంత్యక్రియలకు 5 మందికి మించి ఉండకూడదు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి.

ఏపీలో కొత్త ఇన్‌చార్జి మంత్రులు ..వారికి దక్కని ఛాన్స్

YS Jagan appointed new incharge ministers, ఏపీలో కొత్త ఇన్‌చార్జి మంత్రులు ..వారికి దక్కని ఛాన్స్

13 జిల్లాలకు కొత్తగా ఇన్‌చార్జి మంత్రులను నియమించింది ఏపీ ప్రభుత్వం . వీరిలో ఒక్క మహిళా మంత్రికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు. జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. సీఎం జగన్ సారధ్యంలోని ప్రభుత్వ పథకాలు ఆయా జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయనే దానిపై ఇన్‌చార్జి మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో ఈ మంత్రులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఇదిలా ఇన్‌చార్జి మంత్రుల్లో మహిళా మంత్రులకు చోటు దక్కలేదు. ఇప్పటికే సీఎం జగన్ కేబినెట్లో మేకతోటి సుచరిత (హోంమంత్రి), పాముల పుష్పశ్రీవాణి (ఉప ముఖ్యమంత్రి), తానేటి వనిత (మహిళా శిశు సంక్షేమం) మంత్రులుగా ఉన్నారు. వీరితో పాటు పలువురు మంత్రులకు కూడా ఛాన్స్ దక్కలేదు.

ఏపీ ఇన్‌చార్జి మంత్రులు ఎవరంటే..!

శ్రీకాకుళం – కొడాలి నాని , విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాసరావు,పశ్చిమ గోదావరి – పేర్ని నాని, కృష్ణా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గుంటూరు – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ప్రకాశం – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,నెల్లూరు – బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు – అనిల్ కుమార్, కడప – ఆదిమూలపు సురేష్, అనంతపురం – బొత్స సత్యనారాయణ, చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డిలు ఇన్‌చార్జి మంత్రులుగా నియమితులయ్యారు.

Related Tags