భారత ఛానెళ్లలో యూట్యూబ్‌ పెట్టుబడులు!

YouTube to invest in growing learning content across Indian languages, భారత ఛానెళ్లలో యూట్యూబ్‌ పెట్టుబడులు!

ఎనిమిది భారతీయ కంటెంట్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సోమవారం యూట్యూబ్‌ ప్రకటించింది. వీటీలో ఎగ్జామ్‌ ఫియర్‌(హిందీ), లెర్న్‌ ఇంజినీరింగ్‌, డోంట్‌ మెమొరీస్‌, స్టడీఐక్యూ ఎడ్యూకేషన్‌, డార్ట్‌ ఆఫ్‌ సైన్స్‌, లెర్నెక్స్‌, గెట్‌ సెట్‌ ఫ్లై సైన్స్‌, లెట్స్‌ మేక్‌ ఇంజినీరింగ్‌ సింపుల్‌ ఛానెళ్లలో పెట్టుబడి పెట్టింది. వీటికి యూట్యూబ్‌ లెర్నింగ్‌ ఫండ్‌ నుంచి కంటెట్‌ను అభివృద్ధి చేయడానికి, వివిధ అంశాలను విశ్లేషించడానికి నిధులను సమకూర్చింది.

ఈ ఛానెళ్లు పొలిటికల్‌ సైన్స్‌, జెనిటిక్స్‌, రసాయిన శాస్త్రం, కాలిక్యూలెస్‌లను ఇంగ్లిష్‌, హింది, తమిళ భాషల్లో అభివృద్ధి చేసేందుకు ఇచ్చారు. వీరి ఆయా రంగాల్లో ఇప్పటికే చాలా కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచారు. దేశంలోని కంటెంట్‌ తయారీ దారులు నిర్వహించిన ఎడ్యూకాన్‌లో ఈ విషయాన్ని యూట్యూబ్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *