Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

2019.. యూట్యూబ్‌ హవా.. ఇండియన్స్ చూసింది తెలిస్తే.. షాక్..!

YouTube Rewind... This is what Indians watched the most in 2019, 2019.. యూట్యూబ్‌ హవా.. ఇండియన్స్ చూసింది తెలిస్తే.. షాక్..!

యూట్యూబ్.. ఇందులో సెకన్ల వ్యవధిలోనే.. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో ఎన్ని వీడియోలు ఎంతమంది చూశారన్నది పెద్ద మిస్టరీనే.. టాప్ ట్రెండింగ్‌లో రోజుకో వీడియో ప్రత్యక్షమవుతుంది. వీటిలో ఏయే వీడియోలు అత్యధికంగా వీక్షించారన్న దానిపై యూట్యూబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా.. టాప్ ట్రెండింగ్ వీడియోగా ఖందేశీ మూవీస్‌లోని “ఛోటు కే గోల్‌గప్పే” నిలిచింది.

ఇక టాప్ ట్రెండింగ్ మ్యూజిక్‌ వీడియోగా.. హీరో ధనుష్ మరియు సాయిపల్లవి కలిసి నటించిన తమిళ చిత్రం మారీ-2లోని “రౌడీ బేబీ” సాంగ్ నిలిచింది. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా.. ఈ మూవీకి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. ఇక తరువాతి స్థానాల్లో ధావానీ భానుశాలి పాట వాస్తే జానే బి మరియు నిఖిల్ డి రెండవ స్థానాన్ని పొందాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మ్యూజిక్ వీడియోల విషయానికొస్తే.. “డాడీ యాంకీ” మరియు “స్నోస్ కాన్ కాల్మా” వీడియోలు టాప్‌‌లో నిలిచాయి.

ఇదిలా ఉంటే.. భారత్‌లో మహిళా కంటెంట్ క్రియేటర్స్‌ ప్రాధాన్యత పెరిగిపోతుందని యూట్యూబ్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో వీరి సంఖ్య అధికమైందని తెలిపింది. 2016లో మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు కల్గిన కంటెంట్ క్రియేటర్స్‌ ఒక్కరే ఉండగా.. ఈ మూడేళ్లలో వీరి సంఖ్య 120కి చేరిందని వెల్లడించింది.