400 చానెళ్లను నిషేధించిన యూ ట్యూబ్‌

చిన్నారులను హింసించటంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్‌ 400 పైగా ఛానళ్లను నిషేధించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న​ క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూ ట్యూబ్‌ ప్రకటించింది. చిన్నపిల్లలను విపరీతంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కామెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గారిథంపై గతవారం రెడిటర్‌ మాట్‌విల్సన్‌ విమర‍్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది చిన్నపిల్లల్లో […]

400 చానెళ్లను నిషేధించిన యూ ట్యూబ్‌
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 12:10 PM

చిన్నారులను హింసించటంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్‌ 400 పైగా ఛానళ్లను నిషేధించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న​ క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూ ట్యూబ్‌ ప్రకటించింది.

చిన్నపిల్లలను విపరీతంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కామెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గారిథంపై గతవారం రెడిటర్‌ మాట్‌విల్సన్‌ విమర‍్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది చిన్నపిల్లల్లో తీవ్రమైన మానసిక‍ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించడంతో సంస్థ ఈ దిద్దుబాటు చర్యలు తీసుకుంది.